Vodafone Idea : వొడాఫోన్ ఐడియా (వీఐ) తన వినియోగదారులకు షాకిచ్చింది. ప్రీపెయిడ్ చార్జిలను పెంచుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు వీఐ ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో బేస్ ప్లాన్ ధర రూ.99గా ఉంది. మిగిలిన అన్ని ప్లాన్లపై 25 శాతం చార్జిలను పెంచింది. అయితే బేస్ ప్లాన్‌లో ఎస్ఎంఎస్‌లను పంపుకునే వీలు లేదు. కనీసం నెలకు రూ.179 చెల్లిస్తే గానీ ఎస్ఎంఎస్‌లు పంపుకునే వీలు ఇకపై లేదు.
ఇక పెంచిన చార్జిల ప్రకారం వీఐ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి. రూ.79, రూ.149, రూ.219, రూ.249, రూ.299, రూ.399, రూ.449, రూ.379, రూ.599, రూ.699, రూ.1499, రూ.2399 లకు కొత్త ప్లాన్‌లు లభిస్తున్నాయి. వీటి గురించిన పూర్తి వివరాలను కింద ఇచ్చిన చిత్రంలో చూసి తెలుసుకోవచ్చు.
ఇక రూ.48, రూ.98, రూ.251, రూ.351లకు డేటా టాపప్స్‌ను వొడాఫోన్ ఐడియా అందిస్తోంది. పెంచిన చార్జిలు నవంబర్ 25 నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటికే ఎయిర్ టెల్ చార్జిలను పెంచగా, అదే బాటలో వీఐ కూడా చార్జిలను పెంచింది. అయితే రిలయన్స్ జియో ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది.