Virata Parvam Movie Review : రానా, సాయిప‌ల్ల‌వి.. విరాట ప‌ర్వం మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Virata Parvam Movie Review : గ‌తంలో న‌క్స‌ల్స్ బ్యాక్‌డ్రాప్‌తో అనేక సినిమాలు వ‌చ్చాయి. కానీ ఈ మ‌ధ్య కాలంలో అలాంటి సినిమాలు రావ‌డం లేదు. ఎప్పుడో ఒకసారి ఆర్‌.నారాయ‌ణ మూర్తి లాంటి న‌టులు మాత్ర‌మే ఈ త‌ర‌హా సినిమాల‌ను తీస్తున్నారు. మొన్నా మ‌ధ్యే చిరంజీవి ఆచార్య సినిమాతో న‌క్స‌ల్‌గా క‌నిపించారు. అయితే ఆ క‌థ వేరే. ఒక ఊరి కోసం చేసే పోరాటం అది. ఇక విరాట ప‌ర్వం మూవీ కూడా న‌క్స‌ల్ బ్యాక్‌డ్రాప్‌తోనే వ‌చ్చింది. ఇందులో రానా, సాయిప‌ల్ల‌వి ఇద్ద‌రూ న‌క్స‌లైట్లుగా న‌టించారు. ఈ మూవీ శుక్రవారం (జూన్ 17) థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి రానా ఈ మూవీతో హిట్ కొడ‌తాడా.. అస‌లు సినిమా ఎలా ఉంది.. క‌థ ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

విరాట‌ప‌ర్వం సినిమాను య‌దార్థ సంఘ‌ట‌న‌లు, పాత్ర‌ల ఆధారంగా తెర‌కెక్కించారు. 1990ల‌లో తెలంగాణ‌లో న‌క్స‌లైట్ల ప్ర‌భావం ఉధృతంగా ఉన్న స‌మయంలో జ‌రిగిన కొన్ని నిజ‌మైన సంఘ‌ట‌నల ఆధారంగా ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు చెప్పారు. అప్ప‌ట్లో నక్స‌లైట్లు ర‌వ‌న్న‌, స‌ర‌ళ జీవితాల ఆధారంగా ఈ మూవీని తెర‌కెక్కించారు. ఇక క‌థ విష‌యానికి వ‌స్తే..

Virata Parvam Movie Review

క‌థ‌..

అది 1973వ సంవ‌త్స‌రం. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం. తెలంగాణ ప్రాంతం. ద‌ట్ట‌మైన అడ‌వి. అర్థ‌రాత్రి పూట ఓ రోజు పోలీసులు, న‌క్స‌లైట్ల‌కు మ‌ధ్య భీక‌ర‌మైన కాల్పులు జ‌రుగుతాయి. అదే స‌మ‌యంలో వెన్నెల (సాయి ప‌ల్ల‌వి) జ‌న్మిస్తుంది. చిన్న‌ప్ప‌టి నుంచే ఆమెకు ప‌ట్టుద‌ల బాగా ఎక్కువ‌. మొండిర‌కం. అనుకున్న‌ది సాధించ‌డం కోసం ఏమైనా చేస్తుంది. జ‌మ్మికుంట‌లోని మారుమూల గ్రామానికి చెందిన వెన్నెల.. ర‌వ‌న్న (రానా) రాసే పుస్త‌కాల‌కు ఆక‌ర్షితురాల‌వుతుంది. ఆయ‌న‌ను గాఢంగా ప్రేమిస్తుంది. ఎలాగైనా ఆయ‌న‌ను క‌ల‌వాల‌ని అనుకుంటుంది. ఈ క్ర‌మంలోనే ఒకానొక స‌మ‌యంలో ర‌వ‌న్న‌ను ఎలాగైనా క‌ల‌వాల‌ని చెప్పి వెన్నెల ఇంట్లో ఉత్త‌రం రాసి పెట్టి బ‌య‌ట‌కు వెళ్లిపోతుంది. మ‌రి ఆమె ర‌వ‌న్న‌ను క‌లిసిందా ? త‌న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచిందా ? అందుకు ర‌వ‌న్న అంగీక‌రిస్తాడా ? అస‌లు చివ‌ర‌కు ఏమ‌వుతుంది ? అన్న వివ‌రాల‌ను తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెర‌పై చూడాల్సిందే.

ఈ సినిమాను ప‌క్కా న‌క్స‌లైట్ బ్యాక్ డ్రాప్ తో రూపొందించారు. కానీ ఇందులో ల‌వ్ ట్రాక్‌ను జోడించారు. క‌నుక ప్రేక్ష‌కుల‌కు బోర్ కొట్ట‌దు. ర‌వ‌న్న కోసం ప‌రిత‌పించే.. ఆయ‌న‌ను ఆరాధించే యువ‌తిగా వెన్నెల పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి ఒదిగిపోయింది. ఆమెకు ఇలాంటి క్యారెక్ట‌ర్ ల‌భించ‌డం తొలిసారే. అయిన‌ప్ప‌టికీ అద్భుతంగా న‌టించింద‌ని చెప్ప‌వ‌చ్చు. సినిమాలో రానా క‌న్నా ఆమె పాత్ర నిడివే ఎక్కువ‌. మ‌న‌కు ఆమే సినిమా మొత్తం క‌నిపిస్తుంది. సాయిప‌ల్ల‌వి యాక్టింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ మూవీలోనూ అలాగే జీవించింది. ఇక రానా గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ర‌వ‌న్న పాత్ర‌లో రానా అద్భుతంగా న‌టించాడు. ఇక మిగిలిన పాత్ర‌ల్లోనూ ఆయా న‌టులు త‌మ ప‌రిధుల మేర బాగానే న‌టించార‌ని చెప్ప‌వ‌చ్చు.

1990ల‌లో న‌క్స‌ల్స్ కథాంశంతో సినిమాలు బాగానే వ‌చ్చాయి. క‌నుక వెనుక‌టి త‌రం వారికి ఈ సినిమాలు ఎలా ఉంటాయో బాగా తెలుసు. కానీ ఈ త‌రం వారికి న‌క్స‌ల్ ఉద్య‌మాలు, వారు ఎందుకు పోరాటాలు చేస్తుంటారు.. అన్న విష‌యాలు తెలియ‌వు. క‌నుక వాటి గురించి తెలుసుకోవాల‌నుకునే వారు ఈ మూవీని చూడ‌వ‌చ్చు. అలాగే సాయిప‌ల్ల‌వి ఫ్యాన్స్ అయితే క‌చ్చితంగా ఒక‌సారి చూడ‌వ‌చ్చు. ఎంతో ఆశించి, అంచ‌నాలు పెట్టుకుని అయితే వెళ్ల‌కూడ‌దు. ఒక‌సారి మూవీని చూద్దామ‌ని అనుకుంటే వెళ్లి రావ‌చ్చు. ఒక భిన్న‌మైన ఫీలింగ్‌ను క‌లిగిస్తుంది. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఏ స్థాయిలో వ‌సూళ్ల‌ను రాబ‌డుతుందో చూడాలి.

Share
Editor

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM