Virat Kohli : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి ఇప్పుడు అంత ఫేమ్‌ను కోల్పోయాడు. కానీ కోహ్లి కెప్టెన్‌గా ఉన్నన్ని రోజులూ ఒక వెలుగు వెలిగాడు. కోచ్‌ను ఎంపిక చేయడం దగ్గర నుంచి జట్టు సెలెక్షన్ వరకు కోహ్లి అన్నింటా కీలకపాత్రను పోషించాడు. అయితే గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో దారుణ పరాభవం తరువాత అతను జట్టుకు కెప్టెన్ గా వైదొలిగాడు. తరువాత అతన్ని వన్డే, టెస్టు జట్ల కెప్టెన్‌గా కూడా తప్పించారు. ఈ క్రమంలోనే ఫామ్‌ను కోల్పోయిన కోహ్లి ప్రస్తుతం బ్యాట్స్‌మన్‌గా కొనసాగేందుకే ఇబ్బందులు పడుతున్నాడు. ఇటీవలి కాలంలో కోహ్లి ఏమాత్రం ఆకట్టుకునే విధంగా ప్రదర్శన చేయలేదు.
అయితే కోహ్లి బ్యాట్స్‌మన్‌గా విఫలం అవుతున్నప్పటికీ సంపాదనలో మాత్రం టాప్‌లోనే ఉన్నాడు. ఆసియాలోనే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అత్యధిక మొత్తం సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాలో కోహ్లి మొదటి స్థానంలో నిలిచాడు. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే సదరు జాబితాలో కోహ్లి 14వ స్థానంలో నిలిచాడు. ఈ మేరకు హాపర్ హెచ్‌క్యూ అనే సంస్థ 2022కు గాను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను తాజాగా విడుదల చేసింది.
హాపర్ హెచ్‌క్యూ విడుదల చేసిన ఇన్‌స్టాగ్రామ్ రిచ్ లిస్ట్ 2022 ప్రకారం కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కు 10.88 లక్షల డాలర్లను సంపాదిస్తున్నాడని తేలింది. అంటే మన కరెన్సీలో దాదాపుగా రూ.8.69 కోట్లుగా వస్తుంది. ఇక ఇదే జాబితాలో క్రిస్టియానో రొనాల్డొ 23.97 లక్షల డాలర్ల సంపాదనతో మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో అమెరికన్ మోడల్ కైలీ జెన్నర్ నిలిచింది. ఈమె ఒక్క పోస్ట్‌కు 18.35 లక్షల డాలర్లను ఇన్‌స్టాగ్రామ్‌లో సంపాదిస్తోంది. అలాగే మూడో స్థానంలో లియోనెల్ మెస్సీ నిలిచాడు. ఇతను ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు 17.77 లక్షల డాలర్లను సంపాదిస్తూ ఆ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…