Virat Kohli : విరాట్ కోహ్లి నిజంగా కింగ్ భ‌య్యా.. అత‌నిపై వ‌స్తున్న టాప్ మీమ్స్ ఇవే..!

Virat Kohli : భారత్‌, పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే స‌హ‌జంగానే ఇరు దేశాల‌కు చెందిన క్రికెట్ ప్రేమికుల్లో ఎంతో ఆస‌క్తిగా ఉంటుంది. ఇక అదే మ్యాచ్ ఉత్కంఠ‌గా సాగితే.. అంత‌కు మించిన మ‌జా ఏముంటుంది. ఆదివారం జ‌రిగిన భార‌త్‌, పాకిస్థాన్ మ్యాచ్ కూడా స‌రిగ్గా ఇలాగే ఉత్కంఠ‌గా సాగింది. చివ‌రి బంతి వ‌ర‌కు నువ్వా నేనా అన్న‌ట్లుగా పోరు జ‌రిగింది. అయితే కోహ్లి వీరోచిత ఇన్నింగ్స్ కార‌ణంగా భార‌త్ ఈ మ్యాచ్‌లో గెలుపొందింది. త‌న ఖాతాలో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. కీల‌క ద‌శ‌లో ఉన్న జ‌ట్టును కోహ్లి, పాండ్యాలు ఆదుకున్నారు.

34 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయి మ్యాచ్ ఓడిపోతుంద‌నుకున్న ద‌శ‌లో కోహ్లి, పాండ్యా ఆచి తూచి ఆడారు. అవ‌కాశం చిక్కిన‌ప్పుడ‌ల్లా ప‌రుగుల‌ను పిండుకున్నారు. దీంతో అభిమానుల‌కు మ‌ళ్లీ మ్యాచ్‌పై ఆశ‌లు చిగురించాయి. ఇక చివ‌రి ఓవ‌ర్ల వ‌ర‌కు అలాగే సాగింది. చివ‌ర్లో పాకిస్థాన్ చేసిన త‌ప్పుల‌కు తోడు.. కోహ్లి సిక్స్‌ల‌తో విజృంభించాడు. దీంతో చివ‌రి బంతికి గెలుపు ఖాయ‌మైంది. అశ్విన్ విన్నింగ్ షాట్ ఆడాడు. దీంతో అంత‌టా సంబ‌రాలు నెల‌కొన్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆడిన తీరు అమోఘం.

Virat Kohli

53 బంతులు ఆడిన కోహ్లి 6 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 82 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేయ‌గా.. భార‌త్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల‌ను కోల్పోయి 160 ప‌రుగులు చేసింది. ఈ క్ర‌మంలోనే భార‌త్‌కు విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టిన కోహ్లిని నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు. అత‌ను క్రికెట్ రాజు అని వంగి వంగి దండాలు పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే కోహ్లిపై సామాజిక మాధ్య‌మాల్లో మీమ్స్ వైర‌ల్ అవుతున్నాయి. కోహ్లి మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడంటూ ఫ్యాన్స్ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM