యూట్యూబ్ చానల్ పెట్టి సాధారణంగా ఎవరైనా సరే వీడియోలు చేసి అప్‌లోడ్ చేస్తుంటారు. కొంచెం టెక్నికల్ జ్ఞానం ఉంటే ఎవరైనా ఈ పని చేయవచ్చు. పెద్ద కష్టమేమీ కాదు. కానీ అందులో కొంచెం వెరైటీని మిక్స్ చేయాలి. అప్పుడే చానల్ సక్సెస్ అవుతుంది. అవును.. ఆ మహిళ కూడా సరిగ్గా అలాగే చేసి సక్సెస్ అయింది. లక్షల కొద్దీ సబ్‌స్క్రైబర్లను సంపాదించుకుంది. నెల నెలా రూ. లక్షల్లో ఆదాయం సంపాదిస్తోంది. ఆమే.. ఒడిశాకు చెందిన మోనాలీసా.
ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా జాహర్ కు చెందిన మోనాలీసాకు వివాహం అయింది. భర్త బద్రి నారాయణ భద్ర క్రియేటర్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. 2016లో తన భర్త ప్రోత్సాహంతో ఆమె యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి ఆమె పలు భిన్న రకాల వెరైటీ వీడియోలను అప్‌లోడ్ చేస్తూ నెటిజన్ల అభిమానాన్ని చూరగొంది. అన్ని వీడియోల్లోనూ ఆమె చీరకట్టుతో కనిపిస్తుంది.
చీరకట్టులోనే ఆమె గుర్రపు స్వారీ చేస్తుంది. ట్రాక్టర్‌తో పొలం దున్నుతుంది. ట్రక్ డ్రైవింగ్ చేస్తుంది. బుల్లెట్ నడుపుతుంది. వోల్వో బస్ డ్రైవ్ చేస్తుంది. సంప్రదాయ దుస్తుల్లో ఆమె అలా చేస్తుంది కాబట్టే ఆమె చానల్ పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ఆమె చానల్‌కు 22 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉండగా ఆమె నెలకు రూ.1.50 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు తెలిసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…