Viral Video : పండగలు వస్తున్నాయి అంటే చాలు.. ఇంట్లో ఆడవాళ్ళకు పని మాములుగా ఉండదు. ఇళ్ళు శుభ్రం చేయడం, దుమ్ము దులపడంలో బిజీ బిజీ అయిపోతారు. అందులోనూ దీపావళి ఇంకా 2 రోజులే ఉండడంతో లక్ష్మీ పూజ కోసం మహిళలు ఇంటిని కడిగిన ముత్యంలా చేసే పనిలో ఉంటారు. అయితే ఈ సందర్భంగా ఓ మహిళ చేసిన పని సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆమె చేసిన పనికి అందరూ ముక్కున వేలేసుకున్నారు. కిటికీని శుభ్రం చేయడం కోసం ప్రాణాలనే పణంగా పెట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ వీర వనిత చేసిన ఈ స్పెషల్ ఫీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసి సదరు మహిళపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. ఉత్తరప్రేదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళ ఆ ప్రాంతంలోని ఓ నాలుగో అంతస్తులో నివాసం ఉంటోంది. అయితే తన ఇంట్లోని కిటికీని క్లీన్ చేయాలని సదరు మహిళ నిర్ణయించుకుంది.
వెంటనే ఓ క్లాత్ తీసుకుని రంగంలోకి దిగింది. అయితే నాలుగో అంతస్తులో ఉన్న ఆమె.. ఎలాంటి సపోర్ట్ లేకుండా అంత ఎత్తులో ఒంటి చేత్తో కిటికీని క్లీన్ చేసింది. ఆమె పని చేస్తున్న క్రమంలో సాగర్ అనే ఓ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు మహిళ చేసిన పనికి.. కొందరు ఆమెను డేరింగ్ ఉమెన్ అని పొడుగుతుంటే.. ఇంకొందరు ఈ దీపావళికి మీ ఇంటికి లక్ష్మీ దేవి తప్పక రావాలని కోరుకుంటున్నాను అని అనగా.. మరికొందరు ప్రాణాలను లెక్క చేయకపోవడం ఆమె పిచ్చితనమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…