Viral Video : తల్లి ప్రేమ అంటే అదే.. తన పిల్లలను ఎంతో మురిపెంగా చూసుకుంటుంది. తాను తిన్నా, తినకపోయినా.. పిల్లలకు మాత్రం పెడుతుంది. అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. అలాంటి తల్లికి ఏదైనా బహుమతి ఇస్తే అప్పుడు ఆమెలో కనిపించే రియాక్షన్ ను చూసేందుకు కోట్లు ఇచ్చినా సరిపోవు. అంతటి భావోద్వేగం ఉంటుంది. అక్కడ కూడా సరిగ్గా ఇలాగే జరిగింది.
తమిళనాడుకు చెందిన విఘ్నేష్ అనే వ్యక్తి తన తల్లికి బర్త్ డే సందర్భంగా రూ.8,800 పెట్టి ఫోన్ కొని గిఫ్ట్‌గా ఇచ్చాడు. పనిచేసుకుంటున్న ఆమె వద్దకు వెళ్లి ఓ కవర్‌ను ఇచ్చి తెరిచి చూడమన్నాడు. ఆమె తెరిచి చూసి అందులో ఫోన్ కనిపించే సరికి ఆమె షాకైంది. వెంటనే కొడుకు వద్దకు వచ్చి ఆలింగనం చేసుకుంది. తరువాత కవర్‌ను ఆప్యాయంగా హత్తుకుంది.
23 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. చాలా మంది ఆమె రియాక్షన్ చూసి భావోద్వేగానికి గురవుతున్నారు. తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. ఫోన్ ఖరీదు ఎంత అన్నది కాదు ముఖ్యం, తన తల్లికి ఆ కొడుకు ఇచ్చిన ఆ బహుమతే చాలా పెద్దది.
Adhula Irundha Mobile-oda Velai Verum 8800 Rs Dhan…! Aana Enga Amma Patta Sandhoshathuku Velayae Kidayaadhu ❤️ Birthday Gift..! pic.twitter.com/4QZJE7Ocii
— Vignesh (@VigneshSammu) January 5, 2022
ఇక ఈ వీడియోకు ఇప్పటికే 6.13 లక్షలకు పైగా వ్యూస్ రాగా.. 29వేలకు పైగా లైక్స్ వచ్చాయి. 5,900 కు పైగా రీట్వీట్లు వచ్చాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.