Viral Video : సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ప్రతి చిన్న విషయం వైరల్ గా మారుతుంది. స్మార్ట్ ఫోన్ చేతిలోకి రావడంతో కొత్తగా మరియు ఆశ్చర్యంగా అనిపించే ప్రతి విషయాలను కూడా స్మార్ట్ ఫోన్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు నేటి యువత. ఇప్పుడు ఒక వీడియో మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోలో ఉన్న అంత విశేషం ఏమిటబ్బా అనుకుంటున్నారా. అయితే ఆ వీడియోని మీరు కూడా కచ్చితంగా చూడాల్సిందే.
సింహాలు, పులులు, చిరుతలు వంటి జంతువులు పాములను వేటాడడం చాలా అరుదుగా చూస్తాం. కోపంతో ఉన్న చిరుతపులికి చిన్న కొండచిలువ ఎదురైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను కొన్ని రోజుల క్రితం వైల్డ్ లైఫ్ అనిమాల్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇది ఇప్పుడు వేల సంఖ్యలో లైక్స్‌తో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో నది ఒడ్డున చిరుతపులి నీళ్లు తాగుతున్న దృశ్యం ఉంది. అప్పుడు చిరుత పులి చాలా చిన్న పరిమాణంలో ఉన్న కొండచిలువను చూసింది. చిరుతపులి కొండచిలువను చంపకుండా తన పళ్లలో పట్టుకుని రాళ్లను ఎక్కి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. చిరుత పెద్ద రాళ్లలో మార్గం కోసం వెతుకుతున్నప్పుడు, చిరుతపులి కాళ్ళ దగ్గర తల ఉన్న కొండచిలువ చిరుతను కొరికింది. ఇది చిరుతపులికి కోపం తెప్పించింది. దానితో చిరుత నీటిలో ఉన్న కొండచిలువను కిరాతకంగా చంపి, తన నోటిలో పాముతో వెళ్ళిపోయింది.
View this post on Instagram