Viral Video : సాధారణంగా మనం ఇంట్లో పెంచుకునే కుక్క, పిల్లి వంటి వాటి విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. అవి పెంపుడు జంతువులే కావచ్చు.. కానీ క్రూర మృగాల జాబితాకు చెందుతాయి. కనుక వాటితో జాగ్రత్తగానే ఉండాలి. అయితే వీటితోనే ఇంత జాగ్రత్త ఉండాలనప్పుడు సింహం మన ఎదురుగా ఉంటే ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. మనం మన శరీరాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి. లేదంటే అనర్థాలు సంభవిస్తాయి. సరిగ్గా ఓ వ్యక్తికి కూడా ఇలాగే జరిగింది. సింహం ముందు కుప్పి గంతులు వేశాడు. ఏకంగా వేలినే పోగొట్టుకున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
జమైకాలోని సెయింట్ ఎలిజబెత్‌లో ఉన్న ఓ జూలో అక్కడి సిబ్బంది ఒక్క వ్యక్తి సింహంతో ఆటలాడాడు. ఆ.. నన్ను అది ఏం చేస్తుందిలే అని లైట్ తీసుకున్నాడు. దీంతో అతను తన చేతి వేళ్లను దాని నోట్లో పెట్టి ఆడసాగాడు. అయితే అది అతని వేళ్లలో ఒక వేలిని నోట కరుచుకుంది. వెంటనే కొరికి మింగేసింది. దీంతో ఆ వ్యక్తి లబోదిబోమన్నాడు. అయితే అది బోనులో ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే ఇంకా పెద్ద అనర్థమే జరిగి ఉండేది.
ఇక ఈ సంఘటనను అక్కడే ఉన్న కొందరు సందర్శకులు చిత్రీకరించి పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఆ వ్యక్తిని అందరూ విమర్శిస్తున్నారు. సింహంతో పరాచికాలు ఆడితే ఇలాగే జరుగుతందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…