Viral Video : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ అందులో ఒక సోషల్ మీడియా అకౌంట్ ఉంటే చాలు. యువత తమదైన శైలిలో వీడియోలను క్రియేట్ చేస్తూ ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాలలో అప్ లోడ్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోతున్నారు. చదువులలో మార్కుల సంగతేమోగానీ యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ అంటూ కొత్తగా వచ్చే చిత్రాల్లోని పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో తెగ ఫాలోవర్లను సంపాదించుకుంటున్నారు.
ఒక వీడియో క్లిక్ అయిందంటే చాలు రాత్రికి రాత్రే సెలబ్రిటీ స్టేటస్ ను సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి చేసిన డ్యాన్స్ వీడియో యూట్యూబ్ లో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. పక్కా తెలుగు అమ్మాయిల లంగా వోణీ కట్టుకుని ఇసుక తిన్నెలపై చేసిన డాన్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. పాటకు తగ్గట్టు హావభావాలు పలికిస్తూ ఆ అమ్మాయి అందంగా నడుమును వయ్యారంగా తిప్పుతూ డాన్స్ ఇరగదీసింది.

ఆ అమ్మాయి అందానికి తగ్గట్టుగా కెమెరా మ్యాన్ పనితనం కూడా చాలా అద్భుతంగా ఉంది. తమిళ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేయడంతోపాటు, ఈ పాటకు బ్యాక్ గ్రౌండ్ లో అలలు ఎంతో అట్రాక్షన్ గా నిలిచాయి. ఈ అమ్మాయితోపాటు గ్రూప్ కూడా ఆఫ్ శారీస్ తో తమిళ పాటకు ఊర మాస్ డాన్స్ చేస్తూ వీక్షకులు చూపు తప్పుకోలేని విధంగా అత్యద్భుతంగా పాటకు వన్నె తెచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు సైతం అత్యద్భుతంగా డాన్స్ అదరగొట్టారు.. అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియోతో ఈ అమ్మాయిలకు ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది.