Viral Video : మన చుట్టూ సమాజంలో అనేక సంఘటనలు నిత్యం జరుగుతుంటాయి. అయితే వాటిలో మనం తెలుసుకునే సంఘటనలు చాలా కొన్నే ఉంటాయి. కానీ కొన్ని సంఘటనలు మాత్రం మనకు కళ్లబడినప్పుడు అవి మనల్ని కదిలించేస్తుంటాయి. అవును.. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. ఎక్కడ తీశారో తెలియదు కానీ.. ఓ తండ్రి తెచ్చిన సెకండ్ హ్యాండ్ సైకిల్‌ను చూసి ఓ కొడుకు ఆనందం పట్టలేకపోయాడు. ఈ క్రమంలోనే వారి వీడియో అందరినీ కదిలిస్తోంది.
ఒక తండ్రి కష్టపడి సెకండ్ హ్యాండ్ సైకిల్‌ను ఇంటికి తెచ్చాడు. అనంతరం దానికి పూలమాల వేసి పూజ చేశాడు. చివరకు దానికి నమస్కారం పెట్టాడు. అయితే సైకిల్ తెచ్చినప్పటి నుంచి అతని కొడుకు దాని చుట్టే తిరుగుతూ ఎంతో సంతోషంగా ఉన్నాడు. అతను ఆ ఆనందాన్ని పట్టలేకపోయాడు. ఈ క్రమంలోనే చివరకు తన కొడుకును ఆ తండ్రి హత్తుకున్నాడు. కాగా ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. చాలా మందిని ఈ వీడియో కదిలించేస్తోంది. దీన్ని చాలా మంది చూసి కంటతడి పెడుతున్నారు.

ఇక ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరన్ షేర్ చేయగా.. దీనికి ఇప్పటికే 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఎంతో మంది ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేస్తున్నారు. అనేక కామెంట్లు కూడా పెడుతున్నారు. చిన్నపాటి సంతోషం అంటే ఇదే.. వారు పడుతున్న ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://twitter.com/AwanishSharan/status/1527843138210975746