Viral Photo : మనలో కొందరికి సహజంగానే క్రియేటివిటీ కాస్త ఎక్కువగా ఉంటుంది. దీంతో వారు కొన్ని రకాల వస్తువులను ఉపయోగించి అందమైన ఆకృతులను రూపొందిస్తుంటారు. ఇక కొందరైతే కొన్ని వస్తువులతో ఏకంగా దుస్తులనే తయారు చేస్తుంటారు. అయితే ఇప్పుడు కూడా సరిగ్గా అలాగే జరిగింది. ఓ మహిళ చిప్స్ ప్యాకెట్లతో చీరను రూపొందించగా.. అందుకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్‌గా మారింది.

ఓ మహిళ ఖాళీ చిప్స్ ప్యాకెట్‌లను ఉపయోగించి చీరను రూపొందించింది. దాన్ని మొదటగా చూస్తే చిప్స్ ప్యాకెట్లతో చీర తయారు చేసినట్లు అనిపించదు. కానీ నిశితంగా గమనిస్తే.. ఆ విషయం తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆ చిప్స్ చీరను ఆ మహిళ ధరించి ఫొటోలకు పోజులు ఇచ్చింది. దాన్ని ఫొటో తీసి షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది.
ఆ మహిళ క్రియేటివిటీని అందరూ మెచ్చుకుంటున్నారు. కాదేదీ కవితకు అనర్హం.. అన్నట్లుగా కాదేదీ.. చీర తయారీకి అనర్హం అని అంటున్నారు. ఇక ఆ చీర ఫొటోపై ఇప్పటికే చాలా మంది కామెంట్లు చేయగా.. ఆ మహిళ అలా చీరను తయారు చేసినందుకు గాను నెటిజన్ల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.