Viral Photo : ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ ఉండడంతో ప్రతిదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక కొంతకాలంగా నెట్టింట త్రో బ్యాక్ పిక్చర్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం విదితమే. తమ చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ షేర్ చేస్తుంటారు. స్టార్ హీరో హీరోయిన్స్ నుంచి సామాన్యుల వరకు ఈ ట్రెండ్ పేరుతో బాల్యానికి సంబంధించిన ఫోటోలను తమ సన్నిహితులతో ఫాలోవర్లకు షేర్ చేస్తున్నారు. ఇటీవల రామ్‌చరణ్, అల్లు అర్జున్, ఆలియా భట్, నాగచైతన్య, కీర్తి సురేష్, రష్మిక మందన్నా, సమంత వంటి స్టార్ హీరోయిన్లకు చెందిన చిన్ననాటి ఫోటోస్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా మరో యంగ్ హీరో త్రో బ్యాక్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పైన ఉన్న ఫోటోలో వాళ్ల తల్లి పక్కనే కూర్చున్న ఈ క్యూట్ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో. ఇక యూత్‌లో ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ కుర్ర హీరో ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ఇక మీరు గుర్తు పట్టండి చూద్దాం.
ఆ క్యూట్ చిన్నోడు ఎవరో కాదు.. యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్. హ్యాపీడేస్ సినిమాతో వెండితెరకు పరిచయమైన నిఖిల్ ఆ తరువాత యువత, స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఈ హీరో ప్రధాన పాత్రలో కార్తీకేయ 2 సినిమా వచ్చింది. గతంలో సూపర్ హిట్ అయిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కించారు. అయితే రెండు సినిమాల కథలు మాత్రం వేరే. కార్తికేయ 2 హిందీ మార్కెట్‌లో రూ.30 కోట్లను వసూలు చేసి ఘన విజయం సాధించింది. దీంతో కార్తికేయ 3 తీస్తామని ప్రకటించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…