Viral News : వేయి అబద్దాలు ఆడి అయినా సరే ఒక పెళ్లి చేయాలని అంటారు. అయితే పెళ్లి చేసేందుకు అబద్దాలు ఆడవచ్చు.. కానీ అవి షాక్‌కు గురి చేసే అబద్ధాలు అయి ఉండకూడదు. అలాంటి అబద్ధాలు ఆడితే ఆ పెళ్లిళ్లు జరగవు. మధ్యలోనే ఆగిపోతాయి. ఇలాంటి పెళ్లిళ్లు ఎన్నింటినో మనం మధ్యలోనే ఆగిపోవడాన్ని చూశాం. ఇక సరిగ్గా ఇలాంటిదే ఓ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోనూ చోటు చేసుకుంది. సరిగ్గా పెళ్లి మండపం వద్దకు వెళ్లి కూర్చుంటే ఇంకొద్ది నిమిషాల్లో పెళ్లి జరుగుతుంది అనగా.. అసలు విషయం బయట పడింది. దీంతో పెళ్లి కూతురు తనకు పెళ్లి వద్దని అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగింది.. అన్న విషయానికి వస్తే..
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ అనే ప్రాంతంలో ఓ చోట పెళ్లి జరుగుతోంది. ముందు రోజు అన్ని కార్యక్రమాలను పూర్తి చేశారు. మరుసటి రోజు ఉదయాన్నే పెళ్లి జరుగుతోంది. ఈ క్రమంలోనే పెళ్లి కొడుకు మండపం వద్దకు చేరుకుని దాన్ని ఎక్కే క్రమంలో స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అతను ధరించిన విగ్ ఒక్కసారిగా ఊడిపోయింది. అయితే ఈ విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు ఒక్కసారిగా షాక్‌కు గురైంది. దీంతో ఆమె వెంటనే పెళ్లిని రద్దు చేసుకుంది. తనకు పెళ్లి వద్దంటే వద్దని ఖరాఖండిగా చెప్పేసింది.
అయితే పెద్దలు పంచాయతీ పెట్టి ఆ వధువుకు నచ్చజెప్పాలని చూశారు. కానీ ఆమె వినిపించుకోలేదు. తనకు బట్టతల ఉన్న వ్యక్తి భర్తగా వద్దని ఆమె చెప్పింది. దీంతో పెళ్లి కోసం వారు పెట్టిన రూ.5.66 లక్షల ఖర్చును వరుడి కుటుంబం వెనక్కి ఇచ్చేయాలని తీర్మానించారు. అయితే అంతటితో వధువు ఆగలేదు. వరుడిపై చీటింగ్ కేసు పెట్టింది. ఈ క్రమంలోనే పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…