Vijay Varasudu Movie : ఈ మధ్య కాలంలో చాలా వరకు మూవీలు థియేటర్లలోకి వచ్చిన వెంటనే చాలా తక్కువ రోజుల్లోనే ఓటీటీల్లోనూ రిలీజ్ అవుతున్నాయి. ఇందుకు స్టార్ హీరోల సినిమాలు ఏమీ మినహాయింపు కాదు. అందువల్ల ప్రేక్షకులు చాలా వరకు ఓటీటీల్లోనే మూవీలు చూసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక స్టార్ హీరోల అభిమానులు అయితే ముందుగా థియేటర్లలో సినిమాలను చూస్తున్నారు. తరువాత ఓటీటీల్లోనూ ఆ మూవీలను చూస్తూ పండుగ చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలు చాలానే ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి. అయితే ఇక మరో స్టార్ హీరో మూవీ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమవుతోంది. అదే.. విజయ్ నటించిన వారసుడు మూవీ.
తమిళ నటుడు విజయ్ హీరోగా.. దిల్ రాజు ఈ మధ్యే వారసుడు మూవీని రిలీజ్ చేశారు. ఈ మూవీ తమిళంలో వరిసుగా వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఓపెనింగ్స్ మాత్రం బాగానే వచ్చాయి. ఈ మూవీ సంక్రాంతి బరిలో నిలిచింది. అయితే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల ముందు నిలబడలేకపోయింది. ఈ మూవీని వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. ఇందులో విజయ్‌కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా యాక్ట్ చేసింది.

ఫ్యామిలీ డ్రామా జోనర్‌లో ఈ మూవీ రిలీజ్ కాగా.. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన లభించింది. అయితే విజయ్ యాక్టింగ్, రష్మిక గ్లామర్ ఈ మూవీని ఆ మాత్రం నిలిపాయని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా ఓవరాల్‌గా బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లను కలెక్ట్ చేసినట్లు తెలిపారు. అయితే ఈ మూవీ ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ మూవీకి గాను అమెజాన్ ప్రైమ్ సంస్థ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. దీంతో ఆ యాప్‌లోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక ఫిబ్రవరి 10న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే విడుదలైన నెల రోజులకే ఈ మూవీ ఓటీటీలోకి వస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి ఓటీటీలో ఈ మూవీ ఎలా అలరిస్తుందో చూడాలి.