Venkatesh : టాలీవుడ్ ప్రముఖ నటుడు వెంకటేష్ సినిమాలతో ఫుల్ బిజిగా ఉన్నారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గానే ఉంటున్నారు. ఎక్కువగా తన సోషల్ మీడియాలో వెంకటేష్ ప్రొఫెషనల్ సమాచారాన్ని మాత్రమే తన అభిమానులతో షేర్ చేసుకునేవారు. కానీ ఈ మధ్యకాలంలో లైఫ్ లెసెన్స్, కోట్స్, స్టోరీల్లాంటివి కూడా షేర్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సమంత, నాగచైతన్యలు తన వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పినప్పటి నుండి కంటిన్యూగా ఏదో ఒక కోట్ పెడుతూ వైరల్ అవుతున్నారు.
ముఖ్యంగా నమ్మకం, ప్రేమ, రిలేషన్ షిప్ లాంటి విషయాలపై పోస్టులు చేస్తున్నారు. రీసెంట్ గా అలాంటి ఓ పోస్ట్ వెంకటేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట్లో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ లో.. నిన్ను ఇష్టపడిన వాళ్ళను మిస్ యూస్ చేయకు. నిన్ను కావాలనుకునే వాళ్ళకు బిజీగా ఉన్నానని చెప్పకు. ఎవరైతే నిన్ను ఎక్కువగా నమ్ముతారో వాళ్ళను మాత్రం ఎప్పటికీ మోసం చేయోద్దు. నిన్ను ఎప్పుడూ గుర్తు పెట్టుకునే వాళ్ళను అస్సలు మర్చిపోవద్దు.. అంటూ వెంకటేష్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ పోస్ట్ పై పలు కామెంట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా ఈ కొటేషన్స్ చైతన్య, సమంతలను ఉద్దేశించి పెడుతున్నారా.. అని ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరూ విడిపోయే ముందు వెంకటేష్ కూడా సర్ధి చెప్పడానికి ప్రయత్నించారని, ఇద్దరూ విడిపోకుండా ఉండాలని హితబోధ చేసినట్లు సమాచారం. అయినా కూడా సమంత, నాగచైతన్యలు మాత్రం విడాకులు తీసుకున్నారు. ఏది ఏమైనా ఈ విషయంపై ఎంతో మంది ఆసక్తికరమైన పోస్టులు, కామెంట్స్ చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…