Venkatesh : కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చాలా మార్పులు వచ్చాయి. సినిమాల విషయానికి వస్తే చాలా రోజుల పాటు థియేటర్స్ మూతపడడంతో పెద్ద పెద్ద సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. మోహన్ లాల్, సూర్య, నాని, వెంకటేష్ వంటి వారు చేసేదేం లేక తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేశారు. అయితే నాని నటించిన టక్ జగదీష్ ఓటీటీలో రిలీజ్ అవుతుందని ప్రకటన వచ్చినప్పుడు పెద్ద వివాదాలే నడిచాయి.
నానికి భవిష్యత్తు ఏంటో చూపిస్తామని.. కేవలం సినిమాల్లోనే హీరో అని… నిజ జీవితంలో పిరికివాడు అంటూ నానిపై దారుణంగా వ్యాఖ్యలు చేశారు. అలాగే నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేయకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడం ద్వారా సినిమా ఇండస్ట్రీలో ఒక ముఖ్యమైన విభాగాన్ని దెబ్బతీయడంగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అభిప్రాయపడింది. ఇంత జరిగిన కొన్ని రోజులకు వెంకటేష్ హీరోగా సురేష్ బాబు నిర్మించిన నారప్ప ఓటీటీలో విడుదలైంది. ఆ సమయంలో మాట్లాడేవారే కరువయ్యారు.
ఇక ఇప్పుడు వెంకటేష్ మరో చిత్రం దృశ్యం 2 నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అవుతుందని రీసెంట్‌గా ప్రకటించారు. దాంతో సోషల్ మీడియాలో ,మీడియాలో ఓ ఆసక్తికరమైన డిస్కషన్ మొదలైంది. నానిని టార్గెట్ చేసిన వాళ్ళు ఎవరూ ఇప్పుడు దృశ్యం 2 ని థియేటర్ లలో రిలీజ్ చేయండని అడగడం లేదేంటి, సురేష్ బాబుకు భయపడి ఇలా సైలెంట్ అయ్యారా.. అని మరికొందరు క్వశ్చన్ చేస్తున్నారు. థియటర్స్ సజావుగా నడుస్తున్న సమయంలోనూ దృశ్యం 2ని ఓటీటీలో విడుదల చేస్తున్నా, ఎవరూ మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…