Venkatesh Mother : భారత చలన చిత్ర చరిత్రలో నిర్మాత దగ్గుబాటి రామనాయుడిది ఓ అరుదైన అధ్యాయం అని చెప్పుకోవాలి. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. మూవీ మొఘల్ అనే బిరుదును వంద శాతం ఆయన పరిపూర్ణం చేసుకున్నారు. రామానాయుడు చివరి శ్వాసవరకు సినిమాలే ఊపిరిగా బ్రతికారు. చరిత్రలో తన పేరు ఇప్పటికీ గుర్తుండిపోయేలా కొన్ని పేజీలు లిఖించుకున్నారు. తెలుగులోనే కాదు దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ చిత్రాలు తీశారు. భారతీయ భాషలలో 150 కంటే అత్యధిక చిత్రాలను నిర్మించిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం పొందారు.
సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎందరో దర్శకులను, నటీ నటులను, సాంకేతిక నిపుణలను పరిచయం చేసిన ఘనత ఒక రామానాయుడు గారికే దక్కుతుంది. ముఖ్యంగా తెలుగు చిత్ర సీమ అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అద్వితీయం అని చెప్పవచ్చు. బ్రతుకు – బ్రతికించు అనే సిద్ధాంతాన్ని నమ్మడమే కాదు దాన్ని ఆచరించి చూపిన గొప్ప వ్యక్తి రామానాయుడు.
ప్రతి పురుషుని విజయం వెనుక స్త్రీ ఉంటుందని అంటారు మన పెద్దలు. అలాగే రామానాయుడు విజయం వెనుక ఆయన సతీమణి రాజేశ్వరి పాత్ర ఎంతో ఉంది. వీరికి సురేష్, వెంకటేష్ ఇద్దరు కుమారులతో పాటు లక్ష్మి అనే కూతురు జన్మించారు. గ్రామంలో చేస్తున్న వ్యవసాయం వదిలేసి, సినీ రంగానికి వెళ్లాలని నిర్ణయించుకున్న రామానాయుడుని అందరూ నిరుత్సాహ పరిస్తే ఆయన రాజేశ్వరి మాత్రం వెన్నుదన్నుగా నిల్చి ప్రోత్సహించింది.
రామానాయుడు ఒంగోలులోని తన బంధువు బిబిఎల్ సూర్యనారాయణ ఇంట్లో వుంటూ ఎస్ ఎస్ ఎల్ సి చదివే సమయంలో అక్కడే ఉన్న తన మేనమామ ఇంటికి తరచూ వెళ్ళేవారట . ఆ సమయంలోనే రాజేశ్వరిని చూసి మనసు పారేసుకున్న రామానాయుడు రాజేశ్వరిని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని ఆయన తండ్రికి చెప్పారట. కొడుకు మాట కాదనలేక ఆ అమ్మాయితోనే 1958లో పెళ్లి జరిపించారు. ఆరోజుల్లో వందల ఎకరాల్లో వ్యవసాయ భూమి ఉండేది రామానాయుడు కుటుంబానికి. భర్తతో పాటు పొలానికి వెళ్లి, కూలిపనులు పర్యవేక్షించడమే కాకుండా రాజేశ్వరి కూడా కాయకష్టం చేసేవారట.
ఇక రూపాయి విలువ బాగా తెలిసిన వ్యక్తి కావడంతో వచ్చిన ఆదాయంలో చాలా పొదుపు చేసేవారట రాజేశ్వరి. రామానాయుడు చిత్ర రంగానికి వెళ్ళడానికి వీలుగా ఒక్కసారిగా లక్షల్లో డబ్బు ఇచ్చేసరికి ఆయన షాక్ అయ్యారట. ఇది చిన్నప్పటి నుంచి దాచిన సొమ్మని ఆమె చెప్పడంతో ఆయన కళ్ళు చెమర్చాయట. రాజేశ్వరి హస్తవాసి ఎలాంటిదంటే, ఆమె చేతి డబ్బు తీసుకుని సినీ రంగానికి వెళ్లిన రామానాయుడికి పట్టిందల్లా బంగారం అయింది. ఆయన తీసిన చిత్రాలన్నీ హిట్ అయ్యాయి. ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతాలను పొందారు రామానాయుడు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…