Vehicles : సాధారణంగా చాలా మంది వాహనాలను కొనుగోలు చేసిన తరువాత వాటికి న్యూమరాలజీ ప్రకారం తమ లక్కీ నంబర్లు వచ్చేలా నంబర్లను సెట్ చేసుకుంటుంటారు. కొందరైతే ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడరు. అయితే వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా జాతకం ప్రకారం తమ రాశికి సంబంధించిన కలర్ కలిగిన వాహనాన్నే కొనుగోలు చేయాలి. దీంతో ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా ఉంటారు. అలాగే ఆ వాహనంపై ఎక్కడికి వెళ్లి ఏ పని చేసినా కలసి వస్తుంది. కనుక ఎవరైనా సరే తమ రాశికి అనుగుణంగా కలర్‌ను ఎంపిక చేసుకుని దాని ప్రకారం వాహనాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
1. మేష రాశి వారు ఎరుపు రంగు వాహనాలను వాడితే మంచిది. ఈ రంగు వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. అయితే ప్రస్తుతం కొన్ని వాహనాలు మిక్సింగ్ కలర్‌లో వస్తున్నాయి. అలాంటప్పుడు మెయిన్ కలర్ రెడ్ ఉండేలా చూసుకోవాలి. దీంతో రాశి ప్రకారం వాహనానికి కలర్ సెట్ అవుతుంది. అది శుభ ఫలితాలను అందిస్తుంది.
2. వృషభ రాశి వారు పింక్ లేదా తెలుపు రంగులో ఉండే వాహనాలను వాడితే మంచిది. ఈ రంగులు వారికి కలసి వస్తాయి.
3. మిథున రాశి వారు పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగుల్లో దేన్నయినా వాడవచ్చు. ఆ రంగుల్లో ఉండే వాహనాలను కొని వాడాల్సి ఉంటుంది. దీంతో అనుకూల ఫలితాలు వస్తాయి.
4. కర్కాటక రాశి వారు బూడిద రంగు లేదా తెలుపు, సిల్వర్, క్రీమ్ కలర్లలో ఏ రంగు కలిగిన వాహనాన్ని అయినా వాడవచ్చు.
5. సింహ రాశి వారు బంగారం, నారింజ, పర్పుల్ రంగుల్లో ఉండే వాహనాలను వాడితే మంచి జరుగుతుంది.
6. కన్యా రాశి వారికి నీలం, ఆకుపచ్చ, పసుపు, తెలుపు రంగులు శుభ ఫలితాలను అందిస్తాయి. కనుక ఈ రంగుల్లో ఉండే వాహనాలను వాడాలి.
7. తుల రాశి వారు తెలుపు, నీలం రంగుల్లో ఉండే వాహనాలను వాడితే మంచిది. అనుకూల ఫలితాలను పొందవచ్చు.
8. వృశ్చిక రాశి వారు తెలుపు, ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో ఉండే వాహనాలను వాడితే మంచిది.
9. దనుస్సు రాశి వారు ముదురు పసుపు లేదా నారింజ రంగుల్లో ఉండే వాహనాలను వాడాలి. అనుకూల ఫలితాలు వస్తాయి.
10. మకర రాశికి చెందిన వారు నలుపు, పర్పుల్, ముదురు గోధుమ, ఆకుపచ్చ రంగుల్లో ఉండే వాహనాలను వాడవచ్చు.
11. కుంభ రాశి వారు నీలం, పర్పుల్, తెలుపు రంగుల్లో ఉండే వాహనాలను వాడితే మేలు జరుగుతుంది.
12. మీన రాశి వారు పసుపు, నారింజ రంగుల్లో ఉండే వాహనాలను వాడితే మంచిది. అనుకూల ఫలితాలను పొందవచ్చు.
ప్రస్తుతం చాలా వరకు వాహనాలను మిక్సింగ్ కలర్‌లలో అందిస్తున్న నేపథ్యంలో ఒకే కలర్ కలిగిన వాహనాలు లభించడం కాస్త కష్టమే అని చెప్పవచ్చు. అయితే మిక్సింగ్ కలర్స్ ఉండే వాహనాలను తీసుకునే పని అయితే.. వాటిల్లో మెయిన్ కలర్ లేదా అధిక భాగం కలర్ రాశి చక్రానికి చెందినది అయి ఉండే విధంగా చూసుకోవాలి. దీంతో జాతక చక్రం సెట్ అవుతుంది. అనుకూల ఫలితాలు పొందవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…