Vava Suresh : కేరళకు చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్ వావా సురేష్ అంటే అందరికీ పరిచయమే. ఆయన తాజాగా తాచు పాము కాటుకు గురై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. కేరళలోని కొట్టాయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
కొట్టాయంలోని కురిచి గ్రామ పంచాయతీలో ఓ ఇంటి సభ్యులు తమ ఇంటి పశువుల షెడ్డులో ఓ తాచు పాము ఉందని సురేష్‌కు సమాచారం అందించారు. కాగా అక్కడికి చేరుకున్న సురేష్ ఎంతో చాకచక్యంగా ఆ తాచు పామును పట్టుకుని సంచిలో వేసుకున్నాడు. అయితే చివరి నిమిషంలో అతన్ని ఆ పాము కుడి తొడపై కాటు వేసింది. అయినప్పటికీ ఆ పామును సంచిలో వేసి మూటగా చుట్టి దాన్ని సమీపంలోని అడవిలో వదిలేయమన్నాడు. అనంతరం సురేష్ అక్కడికి సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం వెళ్లాడు.
ప్రైవేటు హాస్పిటల్‌లో సురేష్‌ను వెంటిలేటర్‌పై ఉంచారు. పాము విషానికి విరుగుడు ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే మెరుగైన వైద్యం కోసం అతన్ని కొట్టాయం మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ క్రమంలోనే అక్కడ సురేష్‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
అయితే వావా సురేష్ అక్కడ చాలా మందికి తెలిసిన కారణంగా.. ఆయనను పాము కాటేసిందన్న విషయం తెలుసుకుని ఆయన త్వరగా కోలుకోవాలని చాలా మంది నెటిజన్లు ప్రార్థిస్తున్నారు. ఆయన ఇలా పాము కాటుకు గురవడంతో చాలా మంది విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఇక సురేష్ కు ప్రముఖ స్నేక్ క్యాచర్‌గా ఎంతో పేరుంది. ఆయన ఇప్పటి వరకు 50వేలకు పైగా పాములను పట్టుకున్నాడు. అందులో 200 వరకు కింగ్ కోబ్రాలే ఉన్నాయి. ఆయన తన వృత్తిలో ఇప్పటి వరకు అనేక సార్లు పాము కాటుకు గురయ్యాడు. ఇప్పటి వరకు ఆయన 300 సార్లు పాము కాటుకు గురవ్వగా.. అనేక హాస్పిటల్స్ లో చికిత్స పొందారు. ఇక తాజాగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఆయన త్వరగా కోలుకోవాలని అనేక మంది కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…