Varun Tej : మెగా హీరో వరుణ్ తేజ్ దాదాపు రెండేళ్ల తర్వాత గని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. దాదాపు రూ.35 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు విడుదల కాగా, ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులు కలిపి రూ. 25 కోట్లకు అమ్ముడు పోయినట్టు సమాచారం. అయితే చిత్ర ప్రమోషన్‌లో భాగంగా వరుణ్ తేజ్ సినిమాకి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు తెలియజేస్తూ వస్తున్నారు. తాజాగా గని చిత్ర విశేషాలతో పాటు.. తన పెళ్లి గురించి.. తండ్రి నాగబాబు గురించి ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

నాగబాబుకి కొడుకుగా కాకుండా.. ఒక ఫ్యాన్‌గా ఒక ప్రశ్న అడగాలి అనుకుంటే ఏం అడుగుతారు అని యాంకర్ ప్రశ్నించడంతో వరుణ్ తేజ్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. నాన్నని ఇప్పుడు అడగానికి ఏమీ లేవు, ఒకప్పుడు భయం ఉండేది. కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ గా మారాం. నేను అడగాల్సిన ప్రశ్నలన్నీ ఇప్పటికే అడిగేశా.. ఫ్యాన్స్ అడిగే ప్రశ్నల్లో కూడా చాలా వరకూ నేను అడిగేశా. నిహారికను, నన్ను నాన్న ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అడుగుతుంటారు.. దయచేసి అలా అడగొద్దని మేం చెప్తూనే ఉంటాం.
షూటింగ్‌లో ఉన్నప్పుడు కూడా ఫోన్ చేసి ఎక్కడున్నారని అడుగుతుంటారు. షూటింగ్‌లో ఉన్నాం అని అంటే.. త్వరగా వచ్చేయండి అని అంటారు. త్వరగా ఎలా వస్తాం.. షూటింగ్‌లో ఉంటే.. బట్ ఆయన ఫాదర్‌గా అడుగుతుంటారు. ఇక నా పెళ్లి గురించి నాకే వదిలేశారు. సినిమాలనే కాదు.. ప్రతి విషయాన్ని నాకు వదిలేస్తున్నారు. నాన్నకి నాపై నమ్మకం ఎక్కువ. అందుకే అది చెయ్ ఇది చెయ్ అని చెప్పరు. హీరో అవ్వక ముందు ఫస్ట్‌లో నన్ను జిమ్‌కి వెళ్లమని చెప్పారు. యాక్టింగ్ నేర్చుకోమని చెప్పారు.. బుక్స్ చదవమని చెప్పేవారు తప్ప.. అలా ఉండాలి.. ఇలా ఉండాలి అని మాత్రం చెప్పలేదు. నేను సరైన నిర్ణయం తీసుకుంటానని ఆయనకు నమ్మకం ఉంది.. అంటూ చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్.