Varun Sandesh : హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన హీరో వరుణ్ సందేశ్. చాలా రోజుల తర్వాత అతను మళ్లీ ఓ సినిమాతో పలకరించబోతున్నాడు. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై ఎం.శ్రీనివాసరాజు దర్శకత్వంలో మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నఇందువదన చిత్రంలో ఫర్నాజ్ శెట్టి కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలకు అనూహ్యమైన స్పందన వస్తోంది. కంటెంట్ అంతా కళాత్మకంగా ఉంది.
జనవరి 1న సినిమాను విడుదల చేసే ప్లాన్ చేస్తుండగా ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో వరుణ్ సందేశ్ పలు ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. నా కోసం మా నాన్న ఎంతో కష్టపడ్డారు. నా జీవితంలో నాన్న నాకు ఒక గైడ్ అని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చాడు. అలాగే తన ఫాదర్ వితికను సొంత కూతురిలా చూసుకుంటారని కూడా అతను తెలిపాడు. ఇకపోతే పడ్డానండి ప్రేమలో మరి.. సినిమా సమయంలో తాము ప్రేమలో పడ్డామని ,ఇక ఆ టైటిల్ కు తగ్గట్టుగానే తమ ప్రేమలో కూడా తాము పడ్డామని అతను వెల్లడించాడు.
ఇక ఈ ఇద్దరూ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక జరిగిన ట్రోలింగ్ గురించి తెలియజేశాడు. మెసేజ్‌లు చూసి వాళ్లను ఏమనాలో కూడా అర్థం కాలేదని వరుణ్ సందేశ్ తెలిపాడు. గంటసేపు షో చూసి అవతలి వ్యక్తుల క్యారెక్టర్ ను డిసైడ్ చేయకూడదని కూడా.. వరుణ్ సందేశ్ పేర్కొనడం గమనార్హం. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా బాధపడ్డాను. ఒకడి వలన తన భార్య నరకం చూసిందని కూడా వరుణ్ సందేశ్ వెల్లడించాడు. అతడు ఎవరనేది మాత్రం వరుణ్ వెల్లడించలేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…