Upasana Konidela : మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా కోడలిగా ఇంటి బాధ్యతలను, రామ్ చరణ్ వ్యాపారాలను చూసుకుంటున్న ఆమె మరోవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలను కూడా చూసుకుంటూ ఎంతో బిజీగా ఉంటున్నారు. ఇక అన్ని విధాలుగా ఎంతో బిజీగా ఉంటున్నప్పటికీ ఉపాసన మాత్రం సోషల్ మీడియాలో అందరికీ చేరువగానే ఉంటారు. అలాగే తనకు తెలిసిన వాళ్ల ఇండ్లలో జరిగే ఫంక్షన్లకు కూడా వెళ్తుంటారు.
అయితే ఉపాసన, రాంచరణ్ ల వివాహం అయి 10 సంవత్సరాలు గడిచాయి. ఉపాసన సొసైటీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ ఇంకా పిల్లలు లేరనే మాటలు వింటూ ఎంతో బాధకు గురవుతుంటారు. ఎన్నోసార్లు ఈ విషయంపై ప్రశ్నలు ఎదురవగా తాను పిల్లలు కనడం అనేది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని సమయం వచ్చినప్పుడు తానే సమాధానం చెబుతా అంటూ దాటవేస్తూ వచ్చారు.
అయితే తాజాగా గణేష్ నిమజ్జనం సందర్భంగా సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనం కార్యక్రమాలలో పాల్గొని సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన సైతం తన డ్రైవర్ ఇంటికి గణేష్ నిమజ్జనం కోసం వెళ్లారు. అలా ఈమె గణేష్ నిమజ్జనంలో సందడి చేస్తున్న సమయంలో ఈమె బేబీ బంప్ క్లియర్ గా కనిపించడంతో ఉపాసన ప్రెగ్నెంటా అంటూ పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఉపాసన, రాంచరణ్ గణేష్ విగ్రహం పట్టుకున్నటువంటి ఫోటోలో కూడా ఈమె బేబీ బంప్ క్లియర్ గా కనిపిస్తోంది.
ఈ విధంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలలో భాగంగా సందడి చేసిన ఉపాసన ఒక్కసారిగా బేబీ బంప్ తో కనిపించడంతో మెగా అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉపాసనలో కూడా శారీరకంగా మార్పులు చోటు చేసుకోవడంతో ఈమె కచ్చితంగా గర్భం దాల్చిందని అయితే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదని పలువురు భావిస్తున్నారు. అయితే ఇది నిజమైతే త్వరలోనే ఈ విషయాన్ని అధికారకంగా వెల్లడించనున్నారు. ఇక ఈమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…