Upasana Konidela : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మెగా కోడలిగానే కాక సామాజిక సేవా కార్యక్రమాలతో ఎంతో పేరు తెచ్చుకుంది. అపోలో హాస్పిటల్ బాధ్యతలను నిర్వర్తించడంతోపాటు రామ్ చరణ్ వ్యాపారాలు అన్నింటినీ ఈమెనే దగ్గరుండి చూసుకుంటుంది. అలాగే సమాజహిత కార్యక్రమాల్లోనూ ఈమె పాల్గొంటుంది. ఇప్పటికే ఈమె జూ పార్క్‌లో మూగ జీవాలను దత్తత తీసుకుని వాటి ఆలనా పాలనా చూస్తోంది. అలాగే వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలను దత్తత తీసుకుని వారి బాగోగులను చూసుకుంటోంది.
అయితే రామ్ చరణ్, ఉపాసన దంపతులకు వివాహం అయి 10 ఏళ్లు అవుతున్నా పిల్లలు లేరన్న సంగతి తెలిసిందే. ఎప్పుడు పిల్లల గురించి అడిగినా ఈ దంపతులు ఏదో ఒకటి చెబుతుంటారు. మరోవైపు అల్లు వంశంలో ఇప్పటికే బన్నీ ఇద్దరు పిల్లలకు తండ్రి కాగా.. దీంతో అందరి చూపు రామ్ చరణ్‌పైనే పడింది. అయితే పిల్లలు లేనందుకు వీరు ఎంత బాధపడుతున్నారో బయటికి చెప్పడం లేదు కానీ వీరి మాటల ద్వారా ఆ విషయం మాత్రం బాగానే అర్థం అవుతోంది.

ఇక తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాసన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ను పిల్లలు, బంధాలపై స్టేజిపైనే ఆయనను ఓ ప్రశ్నను అడిగారు. ఇందుకు ఆయన బదులిస్తూ.. పిల్లలు లేరి దిగులు చెందాల్సిన పనిలేదన్నారు. ఎందుకంటే కొందరు ఎలాంటి పనిలేకున్నా పిల్లలను కనడమే పనిగా పెట్టుకుంటున్నారని అన్నారు. అలాగే కొందరు ఎంతో పనితో పిల్లలను కనలేకపోతున్నారని అన్నారు. అందువల్ల పిల్లలు లేరని బాధపడడం తగదని అన్నారు. మనం చేయాల్సిన కర్తవ్యం ఏమిటనేది తెలుసుకుని ముందుకు సాగాలన్నారు. అయితే దీనికి స్పందించిన ఉపాసన మాట్లాడుతూ.. మీరు ఈ సమాధానం చెప్పారు కనుక మా ఇళ్ల నుంచి మీకు పలు ఫోన్లు వస్తాయని అన్నారు. కాగా ఈ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.