Unstoppable With NBK : బాలకృష్ణ – రోజా.. ఈ కాంబినేషన్ వింటే అభిమానులకు బొబ్బిలి సింహం, భైరవ ద్వీపం లాంటి క్లాసిక్ హిట్స్ గుర్తుకు వస్తాయి. బాలయ్య, రోజా వెండితెరపై సూపర్ హిట్ జోడీ. ఈ రెండు చిత్రాలు మాత్రమే కాక బాలయ్యతో రోజా పెద్దన్నయ్య, మాతో పెట్టుకోకు, సుల్తాన్ లాంటి చిత్రాల్లో కూడా రొమాన్స్ చేసింది.
వీరిద్దరూ ఇప్పుడు సినిమాలలో నటించకపోయినా కూడా అప్పుడప్పుడూ తమ మాటలతో ప్రేక్షకులకి ఎంటర్‌టైన్ మెంట్ అందిస్తుంటారు. ఈ మధ్య రోజా పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ స్వయంగా రోజాకు ఫోన్ చేసి బర్త్ డే విషెస్ తెలియజేశారట.
అంతేకాదు తాను ‘ఆహా’లో హోస్ట్ చేస్తోన్న ప్రోగ్రామ్‌కు గెస్ట్‌గా రావాలని అడిగారట. ఇక రోజా కూడా బాలయ్య పిలుపుకు ఓకే చెప్పి త్వరలో ఈ షోకు రావడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. బాలయ్య హోస్ట్ చేసిన రెండు ప్రోగ్రామ్‌లను చూసిన రోజా.. ఆయన టాలెంట్‌ను మెచ్చుకున్నట్టు సమాచారం. మొత్తంగా బాలయ్య షోకు రోజా వస్తే నిజంగానే ఆహా అనాల్సిందే. ఇదిలా ఉండగా రోజా .. జబర్ధస్త్ వేదికపై నుండి బాలయ్యకు ఫోన్ చేసిన విషయం తెలిసిందే. ఫోన్ సంభాషణలో బాలయ్య జబర్ధస్త్ షోకు రానున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే కదా.
బాలయ్య షోలో ఇప్పటికే మోహన్ బాబు, నాని తెగ సందడి చేయగా ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా వస్తాడని అంటున్నారు. రౌడీ హీరోతో బాలకృష్ణ సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయ్ ప్రస్తుతం లైగర్ కోసం యూఎస్ లో ఉండగా, షూటింగ్ పూర్తయ్యాక బాలయ్య షోలోలో పాల్గొంటాడని టాక్ వినిపిస్తోంది. ఇక రోజాతో బాలయ్య షో ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…