Unstoppable With NBK : నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహాలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అనే షో నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలో మోహన్ బాబు, నాని లు గెస్ట్‌లుగా సందడి చేయగా, ఈ రెండు ఎపిసోడ్స్ ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇచ్చాయి. ఇక ఈషోకి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా బాలయ్య షోలో సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయని టాక్ వినిపిస్తోంది.

బాలయ్య షోతో మోక్షజ్ఞ డిజిటల్ ఎంట్రీ ఇలా ఉంటే వెండితెర ఎంట్రీ ఎప్పుడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని బాలయ్య తెలిపారు. ఆదిత్య 369 సీక్వెల్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పిన బాలకృష్ణ.. ఈ సినిమాను 2023లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నామని కొద్ది రోజుల క్రితం అన్నారు.
ఇక ఈ సినిమాకు ‘ఆదిత్య 999 మాక్స్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశామని చెప్పిన ఆయన, ఇంకా దర్శకుడిని ఫైనల్ చేయలేదని చెబుతూ తాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదన్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రోల్ కూడా ఉండనుండటం విశేషం. బాలయ్య, మోక్షజ్ఞ ఒకే తెరపై కనిపిస్తే అభిమానులకి కనుల పండుగగా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.