Unstoppable Show : అన్‌స్టాప‌బుల్ షోకు గెస్ట్‌గా ప‌వ‌ర్ స్టార్‌.. ఇక ద‌బిడి దిబిడే..?

Unstoppable Show : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ దశాబ్దాలుగా క్రేజ్ కొనసాగిస్తున్నాడు. వెండితెర సంగతి పక్కనపెడితే బాలయ్య మొదటిసారి బిగ్ స్క్రీన్ నుంచి డిజిటల్ ఫ్లాట్ ఫాంపై తొలి అడుగు వేశారు. ఆహాలో అన్ స్టాబబుల్ అంటూ ఓ టాక్ షో లో హోస్ట్ గా చేశారు. అగ్ర హీరోలంద‌రూ ఈ షోలో పాల్గొన్నారు. ఈ సీజ‌న్ 1 షో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో సీజన్ 2 ఎప్పుడా అని అభిమానులు, ప్రేక్ష‌కులు ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపుల‌కు త‌గిన‌ట్లే త్వ‌ర‌లోనే అన్‌స్టాప‌బుల్ విత్‌ ఎన్‌బీకే సీజ‌న్‌ 2ను నిర్వాహ‌కులు ప్రారంభించ‌బోతున్నార‌ట‌.

ఇప్పటికే నంద‌మూరి ఫ్యాన్స్‌.. అటు మెగా ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ సినిమా స‌మ‌యంలో బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మ‌రోసారి అంత‌కు మించిన కిక్‌ను ఎంజాయ్ చేయ‌బోతున్నార‌ట‌. ఇంతకీ విషయం ఏంటంటే.. నంద‌మూరి బాల‌కృష్ణ‌, ప‌వ‌ర్ స్టార్ పవన్ క‌ళ్యాణ్ క‌లిసి ఒకే వేదిక‌పై క‌నిపించ‌బోతున్నారు. ఇద్దరికీ సినీ నేపథ్యం, రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ ఒకే వేదిక‌పై ఎప్పుడూ క‌నిపించలేదు. అలాంటిది ఇద్దరూ క‌నిపించి, ఒక‌రు ప్ర‌శ్న‌లు వేయ‌టం, మ‌రొక‌రు స‌మాధానాలు చెప్ప‌టం చేస్తే ఇంకెలా ఉంటుంది అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. త్వ‌ర‌లోనే అభిమానుల కోరిక తీరుతుంద‌ని ఫిల్మ్ సర్కిల్ లో టాక్ నడుస్తుంది.

Unstoppable Show

సీజ‌న్ 1 కంటే సీజ‌న్ 2ను ఇంకా గొప్ప‌గా ఉండేలా నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తున్నార‌ట‌. అందులో భాగంగా ఈసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్.. అతిథులుగా రాబోతున్నార‌ని స‌మాచారం. వారిని నంద‌మూరి స్టార్ హీరో ప్రశ్నించనున్నాడని సమాచారం. అసలే త్రివిక్రమ్, పవన్ ఎంత సన్నిహితులో తెలుసు. వీరికి తోడు బాలకృష్ణ కూడా ఉండడంతో కొత్త సీజన్ పై అందరికీ ఆసక్తి నెలకొంది. ఇదే జ‌రిగితే.. సినిమా ముచ్చట్లతోపాటు రాజకీయ అంశాలు కూడా చర్చకు వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాబోయే ఈ షో మాత్రం మెగా ఫ్యాన్స్‌, నంద‌మూరి ఫ్యాన్స్‌కు క‌న్నుల పండుగ‌గా ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM