Unstoppable Show : నందమూరి బాలకృష్ణ తొలిసారిగా బుల్లితెరపై సందడి చేసిన షోలలో అన్‌స్టాపబుల్ షో ఒకటి. ఆయన ఈ షో ద్వారా బుల్లితెరకు తొలిసారిగా పరిచయం అయ్యారు. తొలి షోతోనే ఆయన అదరగొట్టేశారు. ఆహా ప్లాట్‌ఫామ్‌పై ప్రసారం అయిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే తొలి సీజన్ సూపర్ డూపర్ హిట్ అయింది. పలువురు సెలబ్రిటీలు ఈ షో ఎపిసోడ్స్‌లో గెస్ట్‌లుగా పాల్గొని సందడి చేశారు. వారిని వ్యక్తిగత, సినిమాలకు చెందిన ప్రశ్నలు అడిగిన బాలయ్య కాస్త ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఈ షో తొలి సీజన్ ఎంతో ఉత్సాహంగా సాగింది. బాలకృష్ణలోని ఎనర్జీ చూసి అందరూ షాకయ్యారు. ఈ క్రమంలోనే అన్‌స్టాపబుల్ షో తొలి సీజన్ ఎంతో గ్రాండ్‌గా ముగిసింది. అత్యధిక స్థాయిలో రేటింగ్స్‌ను రాబట్టింది.
ఇక తొలి సీజన్ సూపర్ డూపర్ హిట్ కావడంతో నిర్వాహకులు రెండో సీజన్‌కు కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే మొన్నీ మధ్య వరకు ఈ షో కు చెందిన గాసిప్స్ సందడి చేశాయి. కానీ ఇప్పుడు ఆహా వారు ఈ షో గురించిన అధికారిక వివరాలను వెల్లడించనున్నారు. ఈ షోకు చెందిన మరిన్ని వివరాలను ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వెల్లడిస్తామని ప్రకటించేశారు. ఈ మేరకు ఒక ప్రోమోను కూడా వదిలారు. అందులో బాలయ్య మాట్లాడుతూ.. మధుర క్షణాలకు ముగింపు ఉండదని.. కొనసాగింపే ఉంటుందని.. అన్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రోమో ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఇక తొలి సీజన్‌లో రాని గెస్టులను ఈ సారి రప్పించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా ఎన్‌టీఆర్, చిరంజీవి వంటి వారు ఉన్నారని సమాచారం. ఈ క్రమంలోనే తొలి సీజన్‌ను మించి రెండో సీజన్‌ను నిర్వహించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ షోను సెప్టెంబర్‌లో ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం వెల్లడి అయ్యే వరకు వేచి చూడాల్సిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…