TVS Jupiter 125 : టీవీఎస్ సంస్థ కొత్త జూపిటర్ 125ని విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ధర రూ.73,400గా ఉంది. ఇందులో కొత్త ఇంజిన్‌ను ఏర్పాటు చేయగా, డిస్క్, డ్రమ్, డ్రమ్ అలాయ్ వేరియెంట్లలో దీన్ని అందిస్తున్నారు.
టీవీఎస్ జూపిటర్ దేశంలో అమ్ముడతున్న ఉత్తమ స్కూటర్లలో ఒకటి. ఇప్పటికే 45 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించింది. 2013 నుంచి ఈ మోడల్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. కొత్త టీవీఎస్ జూపిటర్ 125 ఎక్స్ షోరూం ధర రూ.73,400గా ఉంది.
టీవీఎస్ జూపిటర్ 125కు చెందిన పలు మోడల్స్ ధరలు ఇలా ఉన్నాయి. డ్రమ్ మోడల్ ఎక్స్ షోరూం ధర రూ.73,400 ఉండగా, డ్రమ్ అలాయ్ మోడల్ ధర రూ.76,800గా ఉంది. డిస్క్ మోడల్ ఎక్స్ షోరూం ధర రూ.81,300గా ఉంది.
కొత్త జూపిటర్ 125లో 33 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కెపాసిటీని అందిస్తున్నారు. ఫ్యుయల్ ఫిల్లర్ బయటకు ఉంటుంది. మొబైల్ చార్జర్, సెమి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, 3 స్టెప్ అడ్జస్టబుల్ రియర్ షాక్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ వంటి సదుపాయాలు ఈ స్కూటర్‌లో లభిస్తున్నాయి.
కస్టమర్లు డ్రమ్ లేదా డిస్క్ మోడల్స్ ను అలాయ్ వీల్స్ తో తీసుకోవచ్చు. ఇక ఈ స్కూటర్‌లో టీవీఎస్‌కు చెందిన సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎస్‌బీటీ)ని అందిస్తున్నారు.
ఈ స్కూటర్‌లో 124.8 సిసి ఇంజిన్ ఉంది. 8 బీహెచ్‌పీ సామర్థ్యం లభిస్తుంది. ఆటోమేటిక్ సీవీటీ గేర్ బాక్స్‌ను అందిస్తున్నారు. ఇంటెల్లిగో టెక్నాలజీ సదుపాయం ఉంది. దీని వల్ల వెహికిల్ ఐడిల్ గా ఉన్నప్పుడు ఇంజిన్ ఆగిపోతుంది. ఇక టీవీఎస్ కంపెనీ ఈ స్కూటర్ బెస్ట్ మైలేజ్ ఇస్తుందని ప్రకటించింది. కానీ ఎంత ఇస్తుందనే వివరాలను మాత్రం వెల్లడించలేదు.
టీవీఎస్ జూపిటర్ 125 ఇదే విభాగంలోని హీరో డెస్టిని 125, హోండా యాక్టివా 125, సుజుకి యాక్సెస్ 125, హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 125 వంటి స్కూటర్లకు గట్టి పోటీనివ్వనుంది. కొత్త టీవీఎస్ జూపిటర్ 125కు గాను దేశవ్యాప్తంగా బుకింగ్స్ ను ప్రారంభించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…