TSRTC : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ఆర్‌టీసీ బస్సుల్లో చార్జిలను పెంచిన విషయం విదితమే. అయితే తాజాగా మరోమారు ఈ చార్జిలను పెంచారు. ఈ మేరకు టీఎస్ఆర్‌టీసీ వైస్ చైర్మన్, ఎండీ వీసీ సజ్జనార్ ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం నుంచి పెంచిన చార్జిలు అమలులోకి వస్తాయని చెప్పారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో డీజిల్ సెస్ పేరిట టిక్కెట్‌కు రూ.2 అదనంగా వసూలు చేయనున్నారు. అలాగే ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్, డీలక్స్, ఏసీ బస్సుల్లో టిక్కెట్‌కు రూ.5 అదనంగా ప్రయాణికుల నుంచి వసూలు చేయనున్నారు.
డీజిల్ సెస్ పేరిట ఈ చార్జిలను పెంచి వసూలు చేస్తున్నట్లు తెలిపారు. టిక్కెట్ల ధరలను ఎందుకు పెంచాల్సి వచ్చిందో సజ్జనార్ వివరించారు. గతంలో ఆర్‌టీసీ బస్సుల్లో వినియోగించే హెచ్ఎస్‌డీ ఆయిల్ ధర లీటర్‌కు రూ.83 ఉండేదని.. కానీ ఇప్పుడు దాని ధర లీటర్‌కు రూ.118గా ఉందని.. ఈ ధర ఎప్పుడో పెరిగినా.. ఆర్‌టీసీ ఇప్పటి వరకు నష్టాలను భరిస్తూనే వస్తుందని.. అయితే ఇన్ని నష్టాలను తట్టుకోవడం కష్టంగా ఉందని.. కనుకనే చార్జిలను మరోమారు పెంచక తప్పడం లేదని సజ్జనార్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.
హెచ్ఎస్‌డీ ఆయిల్‌ను ఆర్‌టీసీ రోజుకు 6 లక్షల లీటర్ల మేర వినియోగిస్తుందని.. అయితే ఈ ఆయిల్ ధర పెరిగినందున నష్టాలను భరించలేకే చార్జిలను పెంచాల్సి వస్తుందని అన్నారు. కాగా పెంచిన ధరలు శనివారం నుంచే అమలులోకి వస్తాయని తెలిపారు. ఈ సందర్బంగా టీఎస్ఆర్‌టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…