Tollywood : ఏ రంగంలో ఉన్న సెలబ్రిటీలు అయినా సరే.. కొన్ని సార్లు దాంపత్య జీవితంలో పొరపచ్చాలు వస్తే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే విడాకులు తీసుకుంటారు. అయితే వారు ధనికులు కనుక అనేక కారణాలను చూపిస్తూ వారు విడాకులు తీసుకుంటారు. కానీ సాధారణ ప్రజలు అలా కాదు. ఎన్నో సమస్యలకు ఓర్చుకుంటారు. జీవితంతో, కుటుంబ సభ్యులతో రాజీ పడతారు. కనుక సాధారణ ప్రజలు విడాకులు తీసుకునే శాతం తక్కువే. సెలబ్రిటీలే ఎక్కువగా విడాకులు తీసుకుంటుంటారు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి.
సెలబ్రిటీలకు సహజంగానే చాలా ధనం ఉంటుంది. భార్య లేదా భర్త ఎవరైనా సరే.. బాగా సంపాదించే వారు లేక తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తిని కలిగి ఉంటారు. ఈ క్రమంలో వారికి ఆర్థిక స్వతంత్రం ఉంటుంది. ఏవైనా చిన్న గొడవలు వస్తే.. నీ నుంచి విడిపోయి నేను బతకలేనా ? నా దగ్గర కూడా డబ్బు ఉంది, నువ్వు లేకపోయినా నేను బతకగలను.. అని ఆలోచిస్తారు. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే విడాకులు ఇస్తారు. సాధారణ ప్రజలు ఇలా కాదు. రాజీ పడిపోతారు. కనుక విడాకుల ప్రసక్తి చాలా వరకు ఉండదు.
ఇక సెలబ్రిటీలు అంటేనే చాలా ఆకర్షణీయంగా ఉంటారు. కనుక వారు ఎప్పుడైనా ఎవరితో అయినా ప్రేమలో పడొచ్చు. పెళ్లయి పిల్లలు ఉన్నప్పటికీ ఒక వ్యక్తి పట్ల ఆకర్షణ కలుగుతుంది. దీంతో కాపురం చేసే జీవిత భాగస్వామితో విడాకులు తీసుకుంటారు. ఈ కారణం వల్ల చాలా సెలబ్రిటీ జంటలు విడిపోయిన సందర్భాలు ఉన్నాయి.
సెలబ్రిటీ జంటల్లో సహజంగానే భార్య, భర్తకు పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఫ్యాన్స్ ఉంటారు. ఎప్పుడైనా సంసారంలో చిన్న గొడవలు వచ్చినా.. ఒకరిని ఒకరు నాలుగు మాటలు అన్నా.. సాధారణ ప్రజలు అయితే సర్దుకు పోతారు. కానీ సెలబ్రిటీలు అయితే ఇగో హర్ట్ అయినట్లు భావిస్తారు. రాజీ ప్రసక్తే ఉండదు. కనుక వెంటనే విడాకులు తీసుకుంటారు. ఇది కూడా వారి విడాకులకు ఒక కారణం అని చెప్పవచ్చు.
సెలబ్రిటీ జంటలు తమ దాంపత్య జీవితంలో ఒకరిపై ఒకరికి బోర్ కొట్టడం సహజమే. దీంతో కొందరు కొత్తదనం కోసం కూడా విడాకులు తీసుకుని ఇంకో లైఫ్ పార్ట్ నర్‌తో సెటిల్ అవుతారు. ఇది కూడా వారి విడాకులకు ఒక కారణంగా భావించవచ్చు.
అయితే ఈ కారణాల వల్లే వారు విడాకులు తీసుకోవాలని ఏమీ లేదు. ఇంకా భిన్నమైన కారణాల వల్ల విడాకులు కూడా తీసుకుంటారు. కానీ సెలబ్రిటీల్లో విడాకులు తీసుకునే శాతం ఎక్కువ..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…