వందేళ్ల సినీ ప్రపంచానికి అనుకోని ఆపద వచ్చి పడింది. సినిమానే తమ ప్రధాన మాధ్యమం అనుకునే ప్రేక్షకులు తమ ఆలోచనను మార్చుకుని మొబైల్ లో సోషల్ మీడియా ద్వారా తమకు కావాల్సిన వినోదాన్ని పొందుతున్నారు. ఇక కరోనా టైం లో ఓటీటీల హవా అందరికీ తెలిసిందే. ఓటీటీలను జనాలకు ఎలా అలవాటు చేయాలి అన్న తరుణంలోనే కోవిడ్ రావడం థియేటర్ లు మూసేయడం జరిగింది. దీంతో సినిమాని థియేటర్ కి వెళ్లి చూసే ఆడియెన్స్ కన్నా ఇంట్లో ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు.
ఇక ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే అసలే మూలుగుతున్న నక్క మీద గుమ్మడికాయ పడ్డట్టు టికెట్ల రేట్ల వ్యవహారం కూడా ఆడియెన్స్ కి చిరాకు తెప్పించాయి. ఇవన్నీ సినిమా మీద ప్రేక్షకులకు ఉన్న ప్యాషన్ ని దూరం చేశాయని చెప్పొచ్చు. ప్రతి శుక్రవారం రిలీజ్ అయ్యే బొమ్మ చూడనిదే నిద్ర పోని ప్రేక్షకులు కూడా ఎందుకు అనవసర ఖర్చు.. ఓటీటీలోకి వచ్చాక చూసేద్దాం లే.. అనుకుంటున్నాడు. ఓటీటీల వల్ల సినిమాలకు ఏ రేంజ్ లో దెబ్బ పడుతుంది అన్నది చెప్పడానికి ఇది చాలు. అలా ఫ్రైడే సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య కూడా చాలా తక్కువ అయింది.
ఇక ఇదొక సెగ్మెంట్ అయితే.. తెలియకుండానే నిర్మాతలకు అదనపు భారం హీరోలు, డైరెక్టర్ల రెమ్యునరేషన్ రూపంలో పడుతోంది. సినిమా నిర్మాణంలో వీరిద్దరి పారితోషికమే 70 శాతం దాకా అవుతుందని తెలుస్తోంది. అందుకే ఈరోజుల్లో ప్రతి నిర్మాత నష్టపోవాల్సి వస్తోంది. అలా కాకుండా ఉండాలంటే అది ఒక కేజీఎఫ్ లేదా విక్రం సినిమాలు అయి ఉండాలి.
ఒకప్పుడు సినిమాని డిస్ట్రిబ్యూటర్ చాలా నమ్మకంతో కొనేవాడు.. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. నిర్మాతల మార్కెటింగ్ జిమ్మిక్కులను వారు కూడా తిప్పుకొడుతున్నారు. అందుకే భారీ లాస్ వచ్చిన డిస్ట్ర్యిబ్యూటర్స్ నిర్మాతల దగ్గర నుంచి కొద్దిమొత్తాన్ని రిటర్న్ తీసుకుంటున్నారు.
నిర్మాతలు కూడా సినిమా బడ్జెట్ ని రూ.5 కోట్లు మించకుండా చేస్తే బాగుంటుంది. అయితే సినిమా నిర్మాణం రూ.5 కోట్లు అంటే అందులో హీరోలకు ఎంత ఇవ్వాలి అన్నది మొదటి ప్రశ్న. ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోల వల్లే మాత్రమే సినిమా పరిశ్రమ నిలబడుతుంది అన్నది ఎంతవరకు నిజమన్నది ఆలోచించాలి. అయితే సినిమా సినిమాకి రెమ్యునరేషన్ పెంచుకుంటూ వెళ్తే మాత్రం పరిశ్రమ మరింత సంక్షోభంలో పడుతుందని చెప్పొచ్చు.
పరిశ్రమలో నెలకొన్న ఈ పరిస్థితిని కూడా ఓటీటీ ఫ్లాట్ ఫాం అవకాశంగా తీసుకుని వారి సబ్ స్క్రిప్షన్ ప్రైజ్ తగ్గిస్తే మాత్రం సినీ పరిశ్రమకు మరింత బొక్క పడే అవకాశం ఉంటుంది. అయితే స్టార్ హీరోలు తక్కువ టైంలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుని సినిమాలు చేస్తే ఈ పరిస్థితిని తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది.
అయితే సినిమా బడ్జెట్ పరిమితులు ఉంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు రావు. అది ఆలోచించాల్సి విషయమే. అయితే ఒక సినిమాతో పోల్చుకుంటే 100 చిన్న సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. అందుకే ఈమధ్య నిర్మాతలు కూడా దీని మీద ఓ సీరియస్ నిర్ణయాన్ని తీసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే వారు హీరోల రెమ్యునరేషన్‌కు భారీగా కోత విధిస్తారని తెలుస్తోంది. అయితే దీనిపై చివరికి వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…