Tollywood : కరోనా వలన సినీ పరిశ్రమ దారుణమైన నష్టాలను చవిచూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పరిస్థితులు చక్కదిద్దుకుంటున్నాయి. అయితే పెద్ద సినిమాలకు ఎలా అయినా మంచి మైలేజ్ ఉంటుంది. చిన్న సినిమాలను ఆదరించడం ఈ సమయంలో కష్టం. అందుకని చాలా మంది స్టార్ హీరోలు కొంత సమయం కేటాయించి ప్రచారం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం నాట్యం ప్రమోట్ చేయడానికి రామ్ చరణ్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఇక అల్లు అర్జున్.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, వరుడు కావలెను ఫంక్షన్స్‌కి హాజరు కాగా ఇప్పుడు పుష్పక విమానం వేడుకకి హాజరు కాబోతున్నాడు. ప్రభాస్ అయితే రొమాంటిక్ ట్రైలర్ సందర్భంగా చిత్ర హీరో, హీరోయిన్లతో సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. ఈ నేపథ్యంలో ఆకాశ్, కేతికా శర్మలకు తనదైన స్టైయిల్‌లో ప్రశ్నలు సంధించాడు. ఇంటర్వ్యూ మొత్తం ప్రభాస్ చాలా ఓపెన్ అయి మాట్లాడాడు. సెటైర్స్ వేస్తూ ఆద్యంతం కట్టిపడేశాడు.
ప్రభాస్‌లో ఈ టాలెంట్ కూడా ఉందా.. అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక బాలయ్య అన్‌స్టాపబుల్ షోతో బుల్లితెరపై రచ్చ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రోమో విడుదల కాగా, ఇది బాలయ్య అభిమానులకు పండగ వాతావరణం తీసుకొచ్చింది. బాలయ్య తమకు అద్భుతమైన వినోదాన్ని అందిస్తుండటంతో ఈ ఎక్స్‌క్లూజివ్ టాక్ షో మొదటి ఎపిసోడ్‌ని చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విధంగా అగ్రహీరోలు చిన్న సినిమాలకు ప్రమోషన్స్ చేస్తుండడం. బుల్లితెరపై షోలు నిర్వహిస్తుండడం.. అభిమానులకు కన్నుల పండుగగా మారింది.