RRR : యావత్ సినీ ప్రపంచం మొత్తం, సినీ ప్రేమికులు, ఎన్టీఆర్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు గత మూడు సంవత్సరాల నుంచి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా RRR. ఈ సినిమా దేశవ్యాప్తంగా నేడు విడుదల కావడంతో సంచలనాలు సృష్టిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఈ సినిమా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాను చూడడం కోసం పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్ల వద్దకు చేరుకుంటున్నారు.
ఈ సినిమా చూసిన అనంతరం ఎంతోమంది అభిమానులు ట్విట్టర్ ద్వారా సినిమాకు రివ్యూ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా అభిమానులు స్పందిస్తూ సినిమా అద్భుతంగా ఉందని, రామ్ చరణ్, ఎన్టీఆర్ ల ఇంట్రడక్షన్ లు వేరే లెవెల్.. అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయినట్లుగా పోస్ట్‌లు పెడుతున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన నాటు నాటు పాట వచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా కూర్చో లేదు.
సీత పాత్రలో నటించిన ఆలియాభట్ ఎంట్రీ ఇవ్వడంతో సినిమా గమనమే మారుతుందని, రాజమౌళి సినిమాని ముందుకు తీసుకెళ్ళిన విధానం ఎంతో అద్భుతంగా ఉందని నిజంగానే దర్శకుడు రాజమౌళికి హాట్సాఫ్ అంటూ అభిమానులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. థియేటర్ మొత్తం చరణ్, తారక్ ల పేర్లు మార్మోగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరు హీరోల ఇంట్రడక్షన్ సీన్లు, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ అదిరిపోయాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…