Pop Corn : ఈ రోజుల్లో మల్టీప్లెక్స్ లకి వెళ్లి సినిమాలు చూడడం అనేది ఎంత ఖర్చుతో కూడుకున్న విషయమో మనందరికీ తెలిసిందే. ఒక వ్యక్తి మాల్ కి వెళ్లి హాయిగా పాప్ కార్న్ తింటూ సినిమా చూసి బయటికి వచ్చాక కానీ అసలు విషయం తెలియదు. తను చూసిన సినిమా టికెట్ తో పోల్చినపుడు పాప్ కార్న్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాడో చాలా మందికి ఇప్పుడే అర్థమవుతోంది. టికెట్ రేట్ కి 2 లేదా 3 రెట్లు అధికంగా పాప్ కార్న్ తినడానికే ఖర్చు చేస్తున్నారు.
ఇక ఫ్యామిలీతో కలిసి మూవీకి వెళితే మాత్రం ఖర్చులు తడిసి మోపెడవడం ఖాయం. నలుగురు సభ్యులు ఉన్న కుంటుంబం అయితే సినిమా టికెట్లకి రూ.1000, కూల్ డ్రింక్స్, పాప్ కార్న్ కొంటే రూ.1000, వీటికి కార్ లేదా బైక్ పెట్రోల్ ఖర్చులు అదనం. మొత్తం మీద ఒక ఫ్యామిలీ సినిమా చూడటానికి అయ్యే ఖర్చు రూ.2000 నుండి రూ.3000 వరకు ఉంటోంది. మామూలు మధ్య తరగతి ప్రజలకి మల్టీప్లెక్స్ లకి వెళ్లి సినిమాలు చూడడం అనేది భారంగా మారిందని చెప్పవచ్చు.
ఇక సినిమా టికెట్ రేట్ల విషయం పక్కన పెడితే.. అసలు మనకి బయట రూ.10 నుండి రూ.20 కి దొరికే పాప్ కార్న్ మల్టీప్లెక్స్ లలో మాత్రం రూ.200 నుండి రూ.500 వరకు ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా ?
అయితే దీనంతటి వెనక ఎన్నో లెక్కలు ఉంటాయని అంటున్నారు అజయ్ బిజ్లి. మన దేశంలోని పీవీఆర్ సినిమాస్ మల్టీప్లెక్స్ కి ఈయనే ఓనర్. ఇక ఈయన ఒక ఇంటర్య్వూ లో మాట్లాడుతూ.. ఇండియా అంతా ఇప్పుడు సింగిల్ స్క్రీన్ల నుండి మల్టీప్లెక్స్ స్క్రీన్లకి మారుతుందని, ప్రేక్షకులు కూడా నెమ్మదిగా ఈ కల్చర్ కి అలవాటు పడుతున్నారని అన్నారు. పెద్ద తెరలపై సినిమా చూడాలంటే ఈ ధరని భరించక తప్పదని చెప్పారు.
ఇక పాప్ కార్న్ ధర విషయానికి వస్తే.. అది పూర్తిగా ప్రేక్షకులకు మాల్స్ అనుభూతిని ఇవ్వడం, రవాణా ఖర్చులు, థియేటర్లలో ఎయిర్ కండిషనింగ్, నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల జీతాలు, మాల్ స్థలానికి అద్దెలు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఈ ధరని పాప్ కార్న్ అసలు విలువతో పోల్చడం సరికాదని అన్నారు. ప్రేక్షకులకి బిగ్ స్క్రీన్ పై తాము అందించే అనుభూతిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. కాగా త్వరలో మల్టీప్లెక్స్ రంగంలో అగ్రగామి కంపైనీలైన పీవీఆర్ ఇంకా ఐనాక్స్ లు రెండూ విలీనం కాబోతున్నాయని తెలుస్తోంది. అయితే పాప్ కార్న్ ధరలు అంత ఎందుకు ఎక్కువ ఉంటాయో చెప్పేసరికి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…