Taraka Ratna : నందమూరి తారకరత్న గుండెపోటుతో బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు. జనవరి 27 శుక్రవారం రోజు నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. సడన్ గా కుప్పకూలడంతో వెంటనే ఆయన్ను దగ్గరలోని ఆసుపత్రిలో చేర్చి ఆ తర్వాత బెంగళూరు లోని నారాయణ హృదయాలకు తరలించారు. ప్రస్తుతం ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. అయితే తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందని రామకృష్ణ తెలిపారు.
తారకరత్నకు ఎక్మో ఏమి పెట్టలేదని.. అదంతా తప్పుడు ప్రచారమేనని ఆయన స్పష్టం చేశారు. తారకరత్న శరీర అవయవాలన్నీ బాగా పనిచేస్తున్నాయని తెలిపారు. న్యూరో రికవరీ కావడానికి కొంత సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. అయితే యంగ్ ఏజ్‌లో తారకరత్నకు ఇలాంటి పరిస్థితి తలెత్తడంపై సినీ నిర్మాత చిట్టిబాబు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తారకరత్న కు సిగరెట్ తాగే అలవాటు ఉందని , దాని వల్లే తారకరత్న రక్త నాళాల్లో బ్లాక్ లు ఏర్పడ్డాయని చెప్పారు. మరోవైపు తారకరత్న కు అరుదైన మెలినా వ్యాధి ఉండటం వల్ల స్టంట్ వేయలేకపోతున్నారని చెప్పారు.

తారకరత్న కోలుకుని మళ్లీ తిరిగి రావాలని చిట్టిబాబు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, నందమూరి బాలకృష్ణ ఆస్పత్రిలోనే ఉండి ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్యపరిస్థితిపై ఆరాలు తీస్తున్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, కన్నడ నటుడు శివరాజ్ కుమార్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మంచు విష్ణులు ఆస్పత్రికి వచ్చి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకోగా, . కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కూడా పలుమార్లు ఆస్పత్రికి వచ్చి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరు ప్రార్ధిస్తున్నారు.