Actress : సినిమా రంగం అనేది ఒక క్రియేటివ్ ఫీల్డ్. ఎంతమంది వారసులు వచ్చినా టాలెంట్ లేనిదే ఇక్కడ ఎవరూ నిలదొక్కుకోలేరు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతమైంది సినిమా. అయితే కొన్ని దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీని ఆంధ్రా ప్రాంత నుంచి వచ్చిన వారే ఏలుతూ వచ్చారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన నటీనటులు టెన్నీషియన్స్ కూడా రాణిస్తున్నారు. అంతే కాకుండా తెలంగాణ ప్రాంతానికి చెందిన హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు సైతం రాణిస్తున్నారు. ఇప్పటికే నితిన్, విజయ్ దేవరకొండ హీరోలుగా సక్సెస్ అయ్యారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే అతితక్కువ మంది ఉన్నారు.. వారెవరంటే..
తొలిప్రేమ సినిమాలో పవన్ తో జతకట్టిన హీరోయిన్ కీర్తిరెడ్డి తెలంగాణ ప్రాంతానికి చెందినదే. నిజామాబాద్ జిల్లాకు చెందిన కీర్తిరెడ్డి తొలిప్రేమ సినిమాతో ఎంట్రీ ఇచ్చి యూత్ ను తనవైపు తిప్పుకుంది. ఆ తరవాత మహేశ్ బాబు అర్జున్ సినిమాలో సోదరి పాత్రలో నటించింది. సీనియర్ హీరోయిన్ సంగీత తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే. వరంగల్ కు చెందిన సంగీత సినిమాల్లో ఎన్నో అవకాశాలు అందుకున్నారు. హీరోయిన్ గా గుడ్ బై చెప్పాక తల్లి పాత్రలు చేశారు. రవితేజ నటించిన ఇడియట్ సినిమాలో సంగీత తల్లిగా నటించి మెప్పించారు. హీరోయిన్ విజయశాంతి కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినవారే. వరంగల్ లో పుట్టిన విజయశాంతి చెన్నైలో చదువుకున్నారు.
ఓసేయ్ రావులమ్మ, అడవిచుక్క, కర్తవ్యం, ప్రతిధ్వని లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి, మెప్పించారు. ఈరోజుల్లో సినిమాతో హీరోయిన్ పరిచయమైన రేష్మా రాథోడ్ సైతం తెలంగాణలోని ఇల్లందు ప్రాంతానికి చెందినది. బాడీగార్డ్, లవ్ సైకిల్ సినిమాల్లో రేష్మా హీరోయిన్ గా నటించింది. హీరోయిన్ ప్రత్యూష కూడా తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిందని ఎక్కువమందికి తెలియదు. తెలంగాణలోని భువనగిరి ప్రాంతంలో ప్రత్యూష జన్మించింది. కెరీర్ ప్రారంభంలో చిన్నచిన్న పాత్రలు చేసిన ప్రత్యూష కలుసుకోవాలని సినిమాలో ఉదయ్ కిరణ్ కు జోడీగా నటించింది. అయితే చిన్నవయసులోనే అనుకోని కారణాల వల్ల ప్రత్యూష ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…