India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

ముగ్గురు నంద‌మూరి హీరోల సినిమాల్లో.. ఈ కామ‌న్ పాయింట్‌ను గ‌మ‌నించారా..?

Mounika by Mounika
Friday, 19 August 2022, 2:32 PM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

వరుస విజయాలతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అఖండతో బాలయ్య బాబు, ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్, ఎప్పుడు బింబిసారతో కళ్యాణ్ రామ్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించారు. ఒక ఎన్టీఆర్ మినహా బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ వరుస పరాజయాలతో సతమతమయ్యారు. అఖండ, బింబిసారతో ఇద్దరూ హిట్ ల‌ను ఖాతాలో వేసుకుని సక్సెస్ ఫామ్ లోకి వచ్చేశారు. కోవిడ్ కారణంగా సంక్షోభంలో ఉన్న ఇండస్ట్రీకి సక్సెస్ తో భారీ చిత్రాలు నిర్మించడానికి కొత్త ఊపిరి పోశారు.

నందమూరి అభిమానులు సైతం తమ  హీరోల సినిమాల  సక్సెస్ తో పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు హీరోలు నటించిన చిత్రాలలో యాదృచ్ఛికంగా ఒక విషయం అందరినీ ఆకర్షించింది. ఇప్పుడు ఈ విషయమే హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏంటి ఆ విషయం అనుకుంటున్నారా.. మరి ఆ ఆస‌క్తికరమైన విషయం ఏంటి అని మీరు కూడా ఒకసారి తెలుసుకోవాలి అనుకుంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే..

there is one common point in rrr and akhanda and bimbisara movies

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించిన చిత్రం అఖండ. గత ఏడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో ఒక పాప పాత్ర మెయిన్ కాన్సెప్ట్  కావడం విశేషం. ఈ చిత్రంలో ప్రజ్ఞా జైస్వాల్, బాలయ్య బాబుకు ఒక పాప కూతురుగా నటించింది. ఈ పాపను కాపాడే నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్న మరో బాలయ్య బయటకు రావడంతో అసలు కథ మొదలవుతుంది. సెకండాఫ్ మొత్తం పాప చుట్టూనే తిరుగుతూ శత్రువులతో పోరాడి అంతం చేస్తాడు అఖండ. ఈ పాప సెంటిమెంట్ వలన ఈ చిత్రం విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR చిత్రం కూడా పాప సెంటిమెంట్ ప్రధానాంశంగా నిలిచిందని చెప్పవచ్చు. పాప కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ కొట్టుకోవడం, అంతేకాకుండా ఎన్టీఆర్ బ్రిటిష్ వారిని ఎదిరించి వాళ్లను మట్టుపెట్టడం జరుగుతుంది. అయితే ఈ చిత్రంలో కూడా ఒక పాప సెంటిమెంట్ కీలక పాత్రను పోషించింది.

అదేవిధంగా ఈ ఆగస్టు 5న విడుదలైన బింబిసార కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. దర్శకుడు వశిష్ట ఒక పవర్‌ఫుల్ కథాంశంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇకపోతే బింబిసార చిత్రంలో కూడా పాప సెంటిమెంట్ అనేది హైలెట్ గా నిలిచింది. బింబిసార చిత్రంలో కళ్యాణ్ రామ్ ప్రాణాలు కాపాడి అతడిని మంచివాడిగా మార్చే కథాంశంలో పాప కీలక పాత్ర పోషించింది.

ఈ చిత్రంలో పాపపై ప్రత్యేక పాట ఉండడం కూడా అందరినీ ఆకర్షించింది. ఎప్పటి నుంచో సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న కళ్యాణ్ రామ్ కి పాప సెంటిమెంట్ బాగా కల‌సి వచ్చిందని చెప్పవచ్చు. యాదృచ్ఛికంగా ఈ మూడు సినిమాలకు విజయాలకు పాప సెంటిమెంట్ కామన్ ఎలిమెంట్ గా నిలిచి.. కలిసి వచ్చిందని చెప్పవచ్చు.

Tags: akhandaBimbisararrr
Previous Post

మ‌హేష్ బాబు అభిమానుల అత్యుత్సాహం.. థియేట‌ర్‌లో తెర‌ను చించేశారు..

Next Post

అవకాశాల కోసం వెళ్తే.. తేజ‌స్విని బెడ్ రూమ్‌కు పిలిచింది ఎవ‌రు ?

Related Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!

by IDL Desk
Thursday, 9 September 2021, 3:05 PM

...

Read more
ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

by IDL Desk
Sunday, 2 March 2025, 2:33 PM

...

Read more
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

by IDL Desk
Friday, 21 February 2025, 1:28 PM

...

Read more
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

by IDL Desk
Saturday, 22 February 2025, 10:19 AM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.