The Warriorr Movie Review : గతంలో ఎన్నడూ లేనివిధంగా యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ కొత్తగా పోలీస్ పాత్రలో నటించిన మూవీ.. ది వారియర్. ఈ మూవీ జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొత్తం 1300 థియేటర్లలో ఈ మూవీన రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే సినిమాకు ముందు నుంచి పాజిటివ్‌గానే రెస్పాన్స్ వస్తోంది. అలాగే ప్రి రిలీజ్ బిజినెస్ కూడా బాగానే చేసింది. ఇక ఈ మూవీ ఎలా ఉంది.. కథ ఏమిటి.. ప్రేక్షకులను అలరించిందా.. లేదా.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కథ..
డీఎస్పీ సత్య (రామ్) ఒక నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్. అవినీతి పరులు, గూండాల గుండెల్లో గుబులు పుట్టిస్తుంటాడు. వారి భరతం పడుతుంటాడు. అయితే సత్యకు కర్నూల్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. దీంతో అక్కడికి వచ్చి మళ్లీ యథావిధిగా డ్యూటీ చేస్తుంటాడు. అక్కడే విజిల్ మహాలక్ష్మి (కృతి శెట్టి) పరిచయం అవుతుంది. ఆమె ఒక ఆర్‌జేగా పనిచేస్తుంటుంది. అయితే సత్య పోలీస్ అన్న విషయం ఆమెకు తెలియదు. కానీ ఇద్దరూ కలసి అక్కడ గురు (ఆది పినిశెట్టి) చేస్తున్న అరాచకాలను ఆపేందుకు యత్నిస్తుంటారు. అయితే అనుకోకుండా సత్య పోలీస్ అని మహాలక్ష్మికి తెలుస్తుంది. దీంతో ఏమవుతుంది ? గురు తనకు అడ్డు తగులుతున్న సత్య, మహాలక్ష్మిలను అడ్డు తొలగించుకోవాలనుకుంటాడా ? చివరకు ఏం జరుగుతుంది ? అన్న విషయాలు తెలియాలంటే.. సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
విశ్లేషణ..
ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు పోలీస్ పాత్రల్లో మెప్పించారు. ఈ కథతో వచ్చే సినిమాలు చాలా వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కనుక రామ్ కూడా ఇదే కథ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. ఆయన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌కు మూవీ సరిగ్గా సరిపోతుందని చెప్పవచ్చు. ఆయన నటనకు పేరు పెట్టాల్సిన పనిలేదు. లవర్ బాయ్‌గా, మాస్ హీరోగా ఎలా అయినా చేయగలడు. ఇక కృతిశెట్టి గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఆమె నటించడం ఈ సినిమాకు ఇంకో ఆకర్షణ అని చెప్పవచ్చు. దీంతోపాటు విలన్‌గా ఆది పినిశెట్టి అదరగొట్టే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.
ఇక ఇతర నటీనటులు కూడా తమ పాత్రల పరిధుల మేర బాగానే నటించారు. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు బాగుంటాయి. మొత్తంగా చెప్పాలంటే రామ్ చాలా రోజుల తరువాత పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌తో మన ముందుకు వచ్చాడని చెప్పవచ్చు. ఈ మూవీ ప్రేక్షకులను తప్పక అలరిస్తుంది. ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…