Sai Pallavi : సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో వెండితెరకి మరికొన్ని అందాల రంగులు అద్దే బాధ్యత హీరోయిన్ మీదే ఉంటుంది. సినీ గ్లామర్ ప్రపంచంలో ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ స్కిన్ షో తప్పదు. వీటికి దూరంగా ఉంటూ తన నటన ద్వారా అభిమానులను సొంతం చేసుకున్న సహజ నటి సాయి పల్లవి. హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఫ్యాన్స్ ని కలిగి ఉన్న హీరోయిన్ కూడా సాయి పల్లవే. కేవలం స్క్రీన్ పై ఆమెను చూడటానికే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. సాయి పల్లవిని టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ అని కూడా ముద్దుగా పిలుస్తారు.
అయితే సాయి పల్లవి తన అద్భుతమైన నటనకు మాత్రమే కాకుండా ఆమె డాన్స్ కి కూడా అభిమానులున్నారు. సాయి పల్లవి డాన్స్ చేస్తుంటే.. నెమలి నాట్యం చేస్తున్నట్టు ఉంటుందని కూడా ప్రశంసిస్తూ ఉంటారు. తన మొదటి తెలుగు సినిమా ఫిదా నుండి ఇటీవలి శ్యామ్ సింగరాయ్ వరకు, పల్లవి ప్రతి సినిమాలోనూ తన డ్యాన్స్‌తో మనల్ని మెస్మరైజ్ చేస్తూనే ఉంది. కానీ ఆమె నటన వెనుక చాలా బాధ మరియు కృషి ఉంది. సాయి పల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలా సాంగ్స్ పిక్చరైజేషన్ టైంలో తన పీరియడ్స్ తనను చాలా ఇబ్బంది పెట్టాయని తెలిపింది. పీరియడ్స్ టైంలో డ్యాన్స్ చేయడం వల్ల శారీరకంగా ఉండే బాధ వర్ణనాతీతం అని పల్లవి పేర్కొంది.
షూటింగ్ సమయంలో ఆమె 2-3 రోజులు నొప్పిని భరించి, ఒకేసారి విశ్రాంతి తీసుకోవలసి వస్తుందని తెలిపింది. పల్లవి నిద్రపోతున్నప్పుడు తన తండ్రి ఆమె పాదాలకు మసాజ్ చేసేవాడని తన పెయిన్ ఫుల్ అనుభవాన్ని చెప్పుకొచ్చింది. శ్యామ్ సింగరాయ్‌లోని క్లాసికల్ సాంగ్ నుంచి తన కెరీర్‌లో చాలా పాటలను, పీరియడ్స్‌లో ఉన్నప్పుడు తీయాల్సి వచ్చిందని సాయి పల్లవి వివరించింది. దీన్నిబట్టి సినిమాల పట్ల సాయి పల్లవి అంకితభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల సాయి పల్లవి నటించిన విరాట పర్వం, గార్గి విడుదయ్యాయి. ఈ రెండు చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి కానీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…