The Family Man 3 : అమెజాన్ ప్రైమ్ వేదికగా గతంలో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్, ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లు ప్రేక్షకులను ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్‌లలో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ముఖ్య పాత్రలో నటించారు. ఇక 2వ సీజన్‌లో సమంత నటించింది. ఈమె ఈ సిరీస్‌లో పలు బోల్డ్ సన్నివేశాల్లో నటించి అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకుంది. అయితే ది ఫ్యామిలీ మ్యాన్ 3వ సీజన్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. గతంలోనే దీనిపై మేకర్స్ ఒక ప్రకటన చేశారు. అయితే అధికారికంగా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. కానీ ఇప్పుడు 3వ సీజన్‌పై అధికారికంగా వివరాలను ప్రకటించనున్నారు.
ది ఫ్యామిలీ మ్యాన్ 3వ సీజన్ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఇందులో చైనీస్ యాంగిల్‌లో నెగెటివ్ గా సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. అయితే దీంట్లో సమంత నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో గోవాకు ఓ అవార్డుల కార్యక్రమానికి వెళ్లినప్పుడు సమంత ఈ సిరీస్ మేకర్స్‌ను కలిసింది. ది ఫ్యామిలీ మ్యాన్ తదుపరి సీజన్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమంత వెల్లడించింది. కనుక 3వ సీజన్‌లో సమంత నటిస్తుందని తెలుస్తోంది.

ది ఫ్యామిలీ మ్యాన్ 2వ సీజన్‌లో సమంత డీగ్లామర్ లుక్ లో కనిపించింది. పలు బోల్డ్ సన్నివేశాల్లోనూ నటించింది. అయితే వీటి వల్లే నాగచైతన్య ఆమెకు విడాకులు ఇచ్చాడని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈమె ఫ్రీ బర్డ్. కనుక మరింత స్వేచ్ఛగా నటించవచ్చు. కాబట్టి ఫ్యామిలీ మ్యాన్ 3వ సీజన్‌లో సమంత నటిస్తే ఇంకా ఎలాంటి సీన్లు ఉంటాయోనని నెటిజన్లు ఆలోచిస్తున్నారు. మరి ఈమె ఇందులో నటిస్తుందా.. నటిస్తే గ్లామర్ షో చేస్తుందా.. అన్న వివరాలపై స్పష్టత రావల్సి ఉంది. మొత్తానికి త్వరలోనే ఈ సిరీస్ తదుపరి సీజన్ ప్రారంభం కానుందని మేకర్స్ ప్రకటించేశారు. కనుక అప్‌డేట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.