దేశవ్యాప్తంగా రోజువారీగా నమోదవుతున్న కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిన విషయం విదితమే. అందులో భాగంగానే అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. పాజిటీవిటీ రేటు 1 శాతానికి చేరుకుంది. దీంతో రాష్ట్రంలోనూ లాక్‌డౌన్ నిబంధనలను సడలించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
అయితే నిబంధనలను సడలించడం కన్నా పూర్తిగా లాక్‌డౌన్‌ను ఎత్తేస్తేనే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అయితే లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూను అమలు చేయాలా, వద్దా ? అని కూడా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. రాత్రి కర్ఫ్యూ ఉంటే ఆర్‌టీసీ సేవలకు ఆటంకం కలుగుతుంది. ప్రజా రవాణాకు ఇబ్బంది కలుగుతుంది. కనుక లాక్‌డౌన్‌తోపాటు రాత్రి కర్ఫ్యూను కూడా పూర్తిగా ఎత్తేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
ఇక లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూలను ఎత్తేసే విషయంలో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 19వ తేదీ వరకు లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్నాయి. కనుక ఈ రోజు లేదా రేపు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణలో బుధవారం ఒక్క రోజే 1489 కోవిడ్ కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 6,07,925కు చేరుకుంది. 3,521 మంది చనిపోయారు. 24 గంటల్లో 11 మంది మృతి చెందారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 175, నల్గొండలో 131, ఖమ్మంలో 118 కేసులు గత 24 గంటల్లో నమోదు అయ్యాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…