Telangana : సంతానం అనేది దంపతులకు దేవుడు ఇచ్చే వరం. అయితే దురదృష్టవశాత్తూ అది కొందరికి ఉండదు. దీంతో వారు సంతానం లేదని దిగులు చెందుతుంటారు. కానీ సంతానం కలిగితే మాత్రం వారు తమ బిడ్డలను అపురూపంగా చూసుకుంటారు. కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అలాంటి సంతానానికి ఏమైనా అయితే వారు భరించలేరు. ప్రస్తుతం ఓ జంట కూడా ఇలాంటి దుస్థితిలోకి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలోని చేవెళ్ల ప్రాంతానికి చెందిన రజకనగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాస్, మంజుల దంపతులకు పిల్లలు లేరు. 14 ఏళ్లకు వారికి ఒక పాప జన్మించింది. ఆమెకు సహస్ర అని పేరు పెట్టుకున్నారు. పెళ్లయిన చాలా ఏళ్లకు పాప జన్మించడంతో ఆమెను అల్లారుముద్దుగా వారు పెంచుకోసాగారు. కానీ పాపం.. ఆ పాపను మృత్యువు డెంగ్యూ రూపంలో కబళించింది.
సహస్రకు సెప్టెంబర్ 26న అనారోగ్య సమస్య వచ్చింది. దీంతో ఆమెను శంకర్ పల్లిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. తరువాత మెరుగైన వైద్యం కోసం ఆమెను మియాపూర్‌లోని ఇంకో ప్రైవేటు హాస్పిట్‌లో చేర్చారు. అయితే అక్కడ ఐసీయూ లేదని చెప్పి అదే హాస్పిటల్‌కు చెందిన ఇంకో బ్రాంచ్ కేపీహెచ్‌బీలో ఉండగా.. ఆ పాపను అక్కడికి తరలించారు. అలా సెప్టెంబర్ 28న ఆమెను ఐసీయూలో చేర్చారు.
అయితే ఆ పాప పరిస్థితి విషమించి మృతి చెందింది. దీంతో ఆ దంపతుల వేదన అంతా ఇంతా కాదు. లేక లేక 14 ఏళ్లకు పాప జన్మించినా.. డెంగ్యూ రూపంలో మృత్యువు ఆమెను వెంట తీసుకుపోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన తెలుసుకున్న చాలా మంది తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే హాస్పిటల్ నిర్లక్ష్యం కారణంగానే తమ పాప చనిపోయిందని ఆ పాప తల్లిదండ్రులు, బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి వారికి నచ్చ జెప్పి పంపించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…