విధి అతనితో వింత నాటకం ఆడింది. పైసా పైసా కూడబెట్టి ఆపరేషన్ కోసమని రూ.లక్షలు దాచుకుంటే వాటిని ఎలుకలు కొరికేశాయి. దీంతో ఆ వ్యక్తి పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. ఈ సంఘటన మహబూబాబాద్ మండలం పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మహబూబాబాద్ మండలం ఇందిరానగర్ కాలనీకి చెందిన భూక్యా రెడ్యా తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. తన పొట్టలో ఏర్పడిన కణితిని ఆపరేషన్ చేసి తొలగించుకునేందుకు కష్టపడి పైసా పైసా కూడబెట్టి, కొందరి వద్ద అప్పులు చేసి రూ.2 లక్షలు పోగు చేశాడు. ఆపరేషన్‌కు ఆ మొత్తం అవసరం అవుతుందని చెప్పడంతో దాన్ని ఎట్టకేలకు పూర్తి చేశాడు. అయితే అతని దురదృష్టమో, మరొకటో తెలియదు కానీ.. విషాదకరమైన సంఘటన జరిగింది.
అతను కూరగాయలు అమ్మగా వచ్చిన రూ.50 వేల నగదును, దానికి తోడు మిగిలిన నగదును మొత్తం కలిపి రూ.2 లక్షలను ఒక ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి ఇంట్లోని చెక్క బీరువాలో దాచాడు. రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో డబ్బును పరిశీలించేందుకు బీరువా తెరిచి చూడగా రూ.2 లక్షలకు సంబంధించిన నోట్లను ఎలుకలు పనికిరాకుండా కొరికేశాయి. రూ.500 నోట్లను ఎలుకలు కొరికి పాడు చేశాయి. దీంతో వాటిని చూసి అతను లబోదిబోమంటున్నాడు. ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. మరి అతని గోడును ఎవరైనా పట్టించుకుంటారా, లేదా.. అన్నది చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…