తమకు ఇష్టం ఉన్న సెలబ్రిటీలను కలిసేందుకు అభిమానులు ఎంత వరకైనా వెళ్తుంటారు. ఏ సాహసాలు అయినా చేస్తుంటారు. ఈ క్రమంలోనే భారతీయుల గుండెల్లో రియల్ లైఫ్ హీరోగా చెరగని ముద్ర వేసుకున్న సోనూ సూద్‌ను కలిసేందుకు కూడా ఓ అభిమాని సాహసం చేశాడు. హైదరాబాద్ నుంచి అతను ముంబైకి కాలినడకన వెళ్లాడు. ఎట్టకేలకు తన హీరో సోనూసూద్‌ను కలిశాడు. అప్పుడు ఆ అభిమానికి కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది.
హైదరాబాద్‌కు చెందిన వెంకటేష్ 700 కిలోమీటర్ల దూరం నడిచి ముంబైకి చేరుకుని సోనూ సూద్‌ను కలిశాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న సోనూ సూద్ అతన్ని ఆ పనిచేయవద్దని వారించాడు. అయినా వెంకటేష్ వినలేదు. కనీసం తనను కలిసేందుకు రవాణా సదుపాయం అయినా ఏర్పాటు చేస్తానని సోనూ వెంకటేష్‌కు తెలిపాడు. వెంకటేష్ అందుకు కూడా ఒప్పుకోలేదు. దీంతో సోనూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఇక ఎట్టకేలకు వెంకటేష్ సోనూ సూద్‌ను ముంబైలో కలిసి ఫొటో దిగాడు. ఆ సమయంలో వెంకటేష్ ఉబ్బి తబ్బిబ్బయ్యాడు.
కాగా సోనూ సూద్ ఇప్పటికే దేశంలో ఎంతో మందికి సహాయం చేయగా, తాజాగా కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో అనేక మందికి ఆక్సిజన్ సరఫరా చేస్తున్నాడు. 150-200 పడకలు ఉన్న హాస్పిటల్స్‌కు సమీపంలో సోనూ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాడు. దీంతో ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నాడు. కాగా సోనూ త్వరలో అక్షయ్ కుమార్ సరసన పృథ్వీ రాజ్ అనే బాలీవుడ్ మూవీతోపాటు తెలుగులో విడుదల కానున్న ఆచార్య మూవీలోనూ కనిపించనున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…