Bandru Shobha Rani : ప్రస్తుతం తెలంగాణలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ క్రమంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపిస్తామని.. ఏకంగా మీడియా సమావేశంలోనే చీర, గాజులను చూపించారు. ఈ క్రమంలోనే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ బండ్రు శోభారాణి ఆయనకు చెప్పు చూపించారు. బుధవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో మహిళా కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డిపై ఫైరయ్యారు. బండ్రో శోభారాణి మాట్లాడుతూ.. ‘తెలంగాణ మహిళలకు పోరాట స్ఫూర్తి ఉంది. మహిళలను అడ్డు పెట్టుకుని పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. పాడి కౌశిక్ రెడ్డి చీర గాజులు పంపాలి అనుకుంటే మొదట కేసీఆర్ కు పంపాలి.
ఇతర పార్టీ నాయకుల చేరికతో టీఆర్ఎస్ పుట్టింది. కేసీఆర్ రాజకీయ పుట్టుక ఎక్కడ ఉందో చూసుకో. మహిళలను చులకన చేసి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టునికి మాట్లాడు. పాడి కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి.. ఆయన మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. పాడి కౌశిక్ రెడ్డి వాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకొని ఆయనను విచారణకు పిలవాలి. ఆయనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా స్పీకర్ ను కోరుతున్నాం. ప్రభుత్వాన్ని పడగొడతామని మీరు అన్నారు.. కానీ, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలబెడుతామంటూ వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు’ అంటూ శోభారాణి మండిపడ్డారు.
‘పాడి కౌశిక్ రెడ్డికి పాడే ఎక్కే సమయం వచ్చింది. తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్లు రువ్విన చరిత్ర నీది. బిడ్డ, భార్యను అడ్డుపెట్టుకొని చనిపోతాం అని ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచావు. పాడి కౌశిక్ రెడ్డి.. పతివ్రత.. శిరోమణి లీడర్ అన్నట్లు మాట్లాడుతున్నాడు. మహిళలను అగౌరవపరిస్తే చెప్పుదెబ్బల పాలవుతావు. వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పకపోతే నిన్ను బయట తిరగనివ్వం’ అంటూ సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి బుడర్ ఖాన్ లాగా మాట్లాడుతున్నాడు. భవిషత్తులో ఆయన బతుకు ఏమైతదో ఆయనకే తెల్వదు. ఎందుకంటే.. కేసీఆర్ అధికారానికి అడ్డొచ్చిన వాళ్ళను ఆగం చేసిండు. కాంగ్రేస్ పార్టీ మహిళలను గౌరవించే పార్టీ అంటూ భవానీరెడ్డి పేర్కొన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…