Telangana : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు షాకులిచ్చేందుకు రెడీ అవుతోందా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలో విద్యుత్ తోపాటు ఆర్‌టీసీ చార్జీలు కూడా భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చార్జిలు ఎంత మేర పెరుగుతాయోనని ప్రజలు ఇప్పటి నుంచే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ చార్జిల పెంపు విషయమై అధికారులు ఇది వరకే ప్రతిపాదనలను సిద్ధం చేశారు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం కేసీఆర్ చార్జిల పెంపు విషయమై నిర్ణయం తీసుకోలేదు. కానీ రెండు శాఖలకు చెందిన అధికారులు మరోమారు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే వారం రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారని, అందులో చార్జిల పెంపునకు అనుమతిస్తారని తెలుస్తోంది. అదే జరిగితే త్వరలోనే ప్రజలపై రెండు చార్జిల భారం పడనుంది.
విద్యుత్ శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనలకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దీంతో చార్జిల పెంపునకు మార్గం సుగమం అవుతుంది. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి.. దాదాపుగా 7 సంవత్సరాలుగా విద్యుత్ చార్జీలను పెంచలేదు. కానీ తీవ్ర నష్టాలు వస్తున్నందున పెంపు తప్పదని తెలుస్తోంది.
ఇక మరోవైపు ఆర్‌టీసీ కూడా కోవిడ్ కారణంగా రూ.3వేల కోట్లు నష్టపోయినట్లు సమాచారం. కోవిడ్ వల్ల ఆర్‌టీసీ చార్జిలను పెంచలేదు. మరోవైపు డీజిల్ ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. దీంతో ఏటా ఆర్‌టీసీపై అదనంగా రూ.550 కోట్ల భారం పడుతోంది. ఈ క్రమంలోనే ఆర్‌టీసీ చార్జిల పెంపు కూడా అనివార్యమేనని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే వారం కేబినెట్ అనుమతి లభిస్తే వెంటనే చార్జిలను పెంచే అవకాశాలు ఉన్నాయి.
ఇక ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసి ఫలితాలు కూడా వచ్చాయి కనుక, ఇబ్బంది ఉండదు కాబట్టి.. సీఎం కేసీఆర్ కూడా ఈ చార్జిల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలుస్తోంది. ఏది ఏమైనా.. రోజు రోజుకీ పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు, గ్యాస్ ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక విద్యుత్, ఆర్‌టీసీ చార్జిలను కూడా పెంచితే ప్రజలకు నెలవారీ ఖర్చులు తడిసి మోపెడు కానున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…