Tea And Coffee : ఉదయాన్నే నిద్ర లేవగానే టీ లేదా కాఫీ కడుపులో పడితే గాని కొంతమందికి రోజుగా మొదలవ్వదు. వేడి వేడి టీ, కాఫీ లేకపోతే ఏదో మిస్సయిన ఫీలింగ్ తో ఇబ్బంది పెడుతుంది. ఇంకొందరికి తలనొప్పి కూడా మొదలవుతుంది. టీ, కాఫీ తాగగానే వారికి వెంటనే శక్తి అందినట్లుగా ఫీలవుతుంటారు మనలో చాలా మంది. దీనికి వీటిలోని చక్కెర, కెఫీన్ రెండూ కారణాలు. కానీ ఎప్పుడైనా మన ఆరోగ్యానికి కాఫీ మంచిదా.. లేక కాఫీ మంచిదా అన్న ఆలోచన మీకు వచ్చిందా.
అయితే టీ కాఫీ రెండింటిలో ఏది మన ఆరోగ్యానికి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. టీ, కాఫీ వలన ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకొని ఏది తాగితే బెటర్ అని నిర్ణయించుకోండి. టి , కాఫీలలో కెఫీన్ అనే సమ్మేళనం ఉంటుందని తెలిసిందే. అయితే టీ కన్నా కాఫీలోనే ఎక్కువగా కెఫీన్ ఉంటుంది. ఈ క్రమంలో నిత్యం మనం 400 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువగా కెఫీన్ తీసుకోరాదు. అంటే.. కాఫీ అయినా టీ.. ఏదైనా సరే.. ఎన్ని కప్పులు తాగినా వాటి ద్వారా మనకు అందే కెఫీన్ పరిమాణం నిత్యం 400 మిల్లీగ్రాములకు మించరాదు.

అయితే రెండింటిలో ఏది తాగితే మంచిది అనే విషయానికొస్తే.. డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నవారు.. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు నిత్యం కాఫీ తాగితే మంచిది. వీలైతే వారు గ్రీన్ టీ తాగాలి. అలాగే ఉదయాన్నే పని భారం ఎక్కువగా ఉంటుందని అనుకునేవారు కాఫీ తాగితే మైండ్ రిలాక్స్ అయి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. శరీరానికి ఉత్సాహం, ఉత్తేజం కలుగుతాయి. దీంతో పెద్దగా పని ఉన్నా భారం అనిపించదు.
ఇక నిత్యం ఉదయాన్నే వ్యాయామం చేసేవారు, శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు టీ తాగడం మంచిది. అలాగే అసిడిటీ, జీర్ణ సమస్యలు ఉన్నవారు టీ తాగాలి. అయితే టీ, కాఫీ రెండింటి ద్వారా మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు కలిగినప్పటికీ వాటిని నిత్యం పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. రోజు 4 లేదా 5 చిన్న కప్పులు ఫర్వాలేదు. అంతకు మించితే శరీరంలో కెఫీన్ పెరిగిపోతుంది. దాంతో ఆరోగ్యకర ప్రయోజనాలు కలగకపోగా, కొత్త అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక ఎవరైనా సరే.. టీ, కాఫీ ఏది తాగినా ఫర్లేదు. కానీ పైన చెప్పినట్లుగా కెఫీన్ మోతాదును చూసుకుని మరీ తాగాలి.