Tapsee : నటి తాప్సీ ఎల్లప్పుడూ ఏవో కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటుంది. తాజాగా ఈమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సీ తన బాయ్ ఫ్రెండ్స్ గురించి పలు విషయాలను వెల్లడించింది.

తాప్సీ మాట్లాడుతూ.. తాను గతంలో చాలా మందితో డేటింగ్ చేశానని.. ఎంతో మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారని.. కానీ అందరూ యూజ్‌లెస్, వేస్ట్ బాయ్ ఫ్రెండ్స్ అని.. తాప్సీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాప్సీ బాలీవుడ్‌లో పలు వరుస సినిమా అవకాశాలతో బిజీగా ఉంది. ఈమెకు అక్కడ సొంత నిర్మాణ సంస్థ కూడా ఉంది. దాంతో త్వరలోనే సమంతతో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు గతంలోనే తెలిపింది. అయితే ఆ మూవీపై ఆ తరువాత ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు.
తాప్సీ ఈ మధ్య కాలంలో కమర్షియల్ సినిమాలు అసలు చేయడం లేదు. కేవలం మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటోంది. అలాంటి సినిమాల్లోనే ఆమె నటిస్తోంది. ఇక తాజాగా తన బాయ్ ఫ్రెండ్స్ ను ఉద్దేశించి తాప్సీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో ఈమెపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.