Tamannah : మిల్కీ బ్యూటీ తమన్నా థండర్ థైస్‌తో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తోంది. వరుస సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హాలిడే వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. మాల్దీవులకు వెళ్లిన మిల్కీ బ్యూటీ బికినీలో రచ్చ చేస్తూ వీకెండ్ లో అభిమానులకు ట్రీట్ ఇస్తోంది. గులాబీ రంగు బికినీ ధరించి మాల్దీవుల బీచ్ లో ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి.

ఇలా ఒక వైపు బికినీ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టించడమే కాకుండా మరోవైపు థైస్ కనిపించేలా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ మరింత సెగ పుట్టిస్తోంది. ఈ విధంగా థైస్ కనిపించేలా పొట్టి డ్రెస్సులో ఏకంగా ఐస్ క్రీమ్ బండి ఎక్కి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ ఫోటోలపై స్పందించిన తమన్నా కామెంట్లు చేసింది. మాల్దీవుల కెళ్ళి తమన్నా ఐస్ క్రీమ్స్ అమ్ముతోందా.. అంటూ పలువురు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం ఈమె క్యూట్ ఫోటోలకి ఫిదా అవుతున్నారు. మొత్తానికి మాల్దీవుల వెకేషన్ లో తమన్నా రచ్చ మామూలుగా లేదనే చెప్పాలి. ప్రస్తుతం ఈమె మాల్దీవుల వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.